Jeremiah · chapter 34 · verse 1
Jeremiah 34:1 in Telugu
బబులోనురాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నియు జనములన్నియు కూడి యెరూషలేముమీదను దాని పురము లన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్దనుండి యిర్మీయాకు దర్శనమైన వాక్కు.
Babulonuraajaina nebukadrejarunu atani samasta senayu atani adhikaaramu krindanunna bhooraajyamulanniyu janamulanniyu koodi yerooshalemumeedanu daani puramu lannitimeedanu yuddhamu cheyuchundagaa yehovaa yoddanundi yirmeeyaaku darshanamaina vaakku.
Jeremiah 34:1 in English
- King James Version (KJV)
- The word which came unto Jeremiah from the LORD, when Nebuchadnezzar king of Babylon, and all his army, and all the kingdoms of the earth of his dominion, and all the people, fought against Jerusalem, and against all the cities thereof, saying,
- World English Bible (WEB)
- The word which came to Jeremiah from the LORD, when Nebuchadnezzar king of Babylon, with all his army, all the kingdoms of the earth that were under his dominion, and all the peoples, were fighting against Jerusalem and against all its cities, saying:
- American Standard Version (ASV)
- The word which came unto Jeremiah from Jehovah, when Nebuchadnezzar king of Babylon, and all his army, and all the kingdoms of the earth that were under his dominion, and all the peoples, were fighting against Jerusalem, and against all the cities thereof, saying:
- Bible in Basic English (BBE)
- The word which came to Jeremiah from the Lord, when Nebuchadrezzar, king of Babylon, and all his army, and all the kingdoms of the earth which were under his rule, and all the peoples, were fighting against Jerusalem and all its towns, saying,
- Darby Translation (DBY)
- The word that came to Jeremiah from Jehovah, when Nebuchadnezzar king of Babylon, and all his army, and all the kingdoms of the earth under his dominion, and all the peoples, fought against Jerusalem and against all the cities thereof, saying,
- Webster's Bible (WBS)
- The word which came to Jeremiah from the LORD, when Nebuchadnezzar king of Babylon, and all his army, and all the kingdoms of the earth of his dominion, and all the people fought against Jerusalem, and against all its cities, saying,
- Young's Literal Translation (YLT)
- The word that hath been unto Jeremiah from Jehovah — and Nebuchadnezzar king of Babylon, and all his force, and all kingdoms of the land of the dominion of his hand, and all the peoples are fighting against Jerusalem, and against all its cities — saying:
Read in context
- 1బబులోనురాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నియు జనములన్నియు కూడి యెరూషలేముమీదను దాని పురము లన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్దనుండి యిర్మీయాకు దర్శనమైన వాక్కు.
- 2ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు వెళ్లి యూదారాజైన సిద్కియాతో ఈలాగు చెప్పుము యెహోవా సెలవిచ్చునదేమనగా నేను ఈ పట్టణమును బబులోను రాజుచేతికి అప్పగించు చున్నాను, అతడు మంటపెట్టి దాని కాల్చివేయును.
- 3నీవు అతని చేతిలోనుండి తప్పించుకొనజాలక నిశ్చయ ముగా పట్టబడి అతనిచేతి కప్పగింపబడెదవు. బబులోను రాజును నీవు కన్నులార చూచెదవు, అతడు నీతో ముఖా ముఖిగా మాటలాడును, నీవు బబులోనునకు పోవుదువు.
Cross references
- Daniel 2:37–38 దానియేలు 2:37–38రాజా, పరలోక మందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్ర హించి యున్నాడు; తమరు రాజులకు రాజైయున్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతిస్థలమందును, మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నిటిని ఆయన తమరి చేతి కప్పగించియున్నాడు, వారందరి మీద తమరికి ప్రభుత్వము ననుగ్రహించి యున్నాడు; తామే ఆ బంగారపు శిరస్సు
- Jeremiah 1:15 యిర్మీయా 1:15ఇదిగో నేను ఉత్తరదిక్కున నున్న రాజ్యముల సర్వవంశస్థు లను పిలిచెదను, వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను, యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటికి ఎదురుగాను, యూదాపట్టణములన్నిటికి ఎదురు గాను తమ సింహాసనములను స్థాపింతురు.
- Jeremiah 27:5–7 యిర్మీయా 27:5–7అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులనుకూడ అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు.
- Daniel 4:1 దానియేలు 4:1రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆ యా భాషలు మాటలాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభి వృద్ధి కలుగునుగాక.
- Jeremiah 32:2 యిర్మీయా 32:2ఆ కాలమున బబులోనురాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోనురాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును,
- 2 Kings 25:1–9 2 రాజులు 25:1–9అతని యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టును ముట్టడి దిబ్బలు కట్టిరి. ఈ ప్రకారము రాజైన సిద్కియా యేలు బడియందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము ముట్టడివేయబడియుండగా నాల్గవ నెల తొమ్మిదవ దిన మందు పట్టణములో క్షామము అఘోరమాయెను, దేశపు జనులకు ఆహారము లేకపోయెను. కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోటదగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి. అయితే కల్దీయులు పట్టణముచుట్టు ఉండగా రాజు మైదానమునకు పోవుమార్గమున వెళ్లి పోయెను; కల్దీయుల సైన్యము రాజును తరిమి, అతని సైన్యము అతనికి దూరముగా చెదరిపోయినందున యెరికో మైదానమందు అతని పట్టుకొనిరి. వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసి కొనిపోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి యిత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసికొనిపోయిరి. మరియు బబులోనురాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో పందొమ్మిదవ సంవత్సరమందు అయిదవ నెల యేడవ దినమున రాజదేహసంరక్షకులకు అధిపతియు బబులోనురాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేము నందున్న యిండ్లన్నిటిని గొప్పవారి యిండ్లన్నిటిని అగ్నిచేత కాల్పించెను.
- 2 Chronicles 36:12–17 2 దినవృత్తాంతములు 36:12–17అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడచుచు, ఆయన నియమించిన ప్రవక్తయైన యిర్మీయా మాట వినకయు, తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమునుబట్టి తనచేత ప్రమాణముచేయించిన నెబుకద్నెజరు రాజుమీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను. అదియుగాక యాజ కులలోను జనులలోను అధిపతులగువారు, అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై, యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచు వచ్చిననుఒ వారు దేవుని దూత లను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరిం చుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధస్థలముగానున్న మంది రములోనే వారి ¸యౌవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు ¸యౌవనులయందైనను, యువతులయందైనను, ముసలి వారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరిని అతనిచేతి కప్ప గించెను.
- Jeremiah 34:7 యిర్మీయా 34:7బబులోనురాజు దండు యెరూషలేముమీదను మిగిలిన యూదా పట్టణములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్తయైన యిర్మీయా యెరూషలేములో యూదా రాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటిని ప్రకటించుచు వచ్చెను.
- Jeremiah 52:4–11 యిర్మీయా 52:4–11అతని యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెల పదియవ దినమున బబులోనురాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేముమీదికి వచ్చి, దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టు కోటలు కట్టిరి. ఆలాగు జరుగగా సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవ త్సరమువరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను. నాల్గవ నెల తొమ్మిదవ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను. పట్టణప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరు పారి పోయి రాజుతోటకు దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములోనుండి బయలు వెళ్లిరి; కల్దీయులు పట్టణమును చుట్టుకొని యుండగా సైనికులు యొర్దానునది మార్గముగా తర్లిపోయిరి. కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలిసికొనగా అతని దండంతయు అతనియొద్దనుండి చెదరిపోయెను. వారు రాజును పట్టు కొని హమాతు దేశమునందలి రిబ్లాపట్టణమున నున్న బబు లోను రాజునొద్దకు అతని తీసికొనిపోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్షవిధించెను. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను; మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతుల నందరిని చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడ దీయించి రెండు సంకెళ్లతో అతని బంధించి, బబులోను నకు అతని తీసికొనిపోయి, మరణమగువరకు చెరసాలలో అతనిపెట్టించెను.
- Jeremiah 39:1–3 యిర్మీయా 39:1–3యూదారాజైన సిద్కియా యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికి వచ్చిదాని ముట్టడివేయగా సిద్కియా యేలు బడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను. యెరూషలేము పట్టబడగా అధిపతులందరు, నేర్గల్షరేజరు సవ్గుర్నెబో షండుల కధిపతియగు శర్సెకీము, జ్ఞానులకధిపతియగు నేర్గల్షరేజరు మొదలైన బబులోనురాజు అధిపతులందరు లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి.
- Daniel 4:22 దానియేలు 4:22రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది; నీవు వృద్ధిపొంది మహా బలముగలవాడ వైతివి; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తాయెను; నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించియున్నది.
- Daniel 5:19 దానియేలు 5:19దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను; ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను; ఎవరిని పడ వేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములును జనులును ఆ యా భాషలు మాటలాడు వారును అతనికి భయపడుచు అతని యెదుట వణకుచు నుండిరి.
Original words (Hebrew)
- word · H1697דָּבָר dâbâr
- Jeremiah · H3414יִרְמְיָה Yirmᵉyâh
- Nebuchadnezzar · H5019נְבוּכַדְנֶאצַּר Nᵉbûwkadneʼtstsar
- king · H4428מֶלֶךְ melek
- Babylon · H894בָּבֶל Bâbel
- army · H2428חַיִל chayil
- kingdoms · H4467מַמְלָכָה mamlâkâh
- earth · H776אֶרֶץ ʼerets
- dominion · H3027יָד yâd
- people · H5971עַם ʻam
- fought · H3898לָחַם lâcham
- Jerusalem · H3389יְרוּשָׁלַ͏ִם Yᵉrûwshâlaim
- cities · H5892עִיר ʻîyr
- saying · H559אָמַר ʼâmar