Jeremiah · chapter 34 · verse 19
Jeremiah 34:19 in Telugu
అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజ పరివారములోని వారిని యాజకులను దేశజనులనందరిని ఆ దూడయొక్క రెండు భాగముల మధ్య నడచినవారినందరిని ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను.
Anagaa yoodaa adhipatulanu yerooshalemu adhipatulanu raaja parivaaramuloni vaarini yaajakulanu deshajanulanandarini aa doodayokka rendu bhaagamula madhya nadachinavaarinandarini aa doodato samaanulugaa cheyuchunnaanu.
Jeremiah 34:19 in English
- King James Version (KJV)
- The princes of Judah, and the princes of Jerusalem, the eunuchs, and the priests, and all the people of the land, which passed between the parts of the calf;
- World English Bible (WEB)
- the princes of Judah, the princes of Jerusalem, the eunuchs, the priests, and all the people of the land, who passed between the parts of the calf.
- American Standard Version (ASV)
- the princes of Judah, and the princes of Jerusalem, the eunuchs, and the priests, and all the people of the land, that passed between the parts of the calf;
- Bible in Basic English (BBE)
- The rulers of Judah and the rulers of Jerusalem, the unsexed servants and the priests and all the people of the land who went between the parts of the ox,
- Darby Translation (DBY)
- — the princes of Judah and the princes of Jerusalem, the eunuchs, and the priests, and all the people of the land, that passed between the parts of the calf;
- Webster's Bible (WBS)
- The princes of Judah, and the princes of Jerusalem, the eunuchs, and the priests, and all the people of the land, who passed between the parts of the calf;
- Young's Literal Translation (YLT)
- heads of Judah, and heads of Jerusalem, the officers, and the priests, and all the people of the land those passing through between the pieces of the calf —
Read in context
- 17కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగువారికిని విడుదల ప్రకటింపవలెనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే; ఆలోచించుడి, విడుదల కావలెనని నేనే చాటించుచున్నాను, అది ఖడ్గ క్షామసంకటముల పాలగుటకైన విడుదలయే; భూరాజ్యము లన్నిటిలోను ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్ము నప్పగించుచున్నాను.
- 18మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగా కోసి వాటిమధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను;
- 19అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజ పరివారములోని వారిని యాజకులను దేశజనులనందరిని ఆ దూడయొక్క రెండు భాగముల మధ్య నడచినవారినందరిని ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను.
- 20వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయజూచువారి చేతికిని వారి నప్పగించుచున్నాను, వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా నుండును.
- 21యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువులచేతికిని వారి ప్రాణము తీయజూచువారిచేతికిని మీయొద్దనుండి వెళ్ళిపోయిన బబులోనురాజు దండు చేతికిని అప్పగించుచున్నాను.
Cross references
- Jeremiah 34:10 యిర్మీయా 34:10ఆ నిబంధననుబట్టి అందరును తమకు దాస దాసీజనముగా నున్న వారిని విడిపించుదుమనియు, ఇకమీదట ఎవరును వారిచేత కొలువు చేయించుకొనమనియు, ఒప్పుకొని, ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరును ప్రజలందరును విధేయులై వారిని విడిపించిరి.
- Zephaniah 3:3–4 జెఫన్యా 3:3–4దాని మధ్య దాని అధిపతులు గర్జనచేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారువరకు ఎరలో ఏమియు మిగులకుండ భక్షించు తోడేళ్లు. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు; దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువు లను అపవిత్రపరతురు.
- Jeremiah 38:7 యిర్మీయా 38:7రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటి లోని కూషీయుడగు ఎబెద్మెలెకను షండుడు,
- Daniel 9:6 దానియేలు 9:6నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని, పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసినవారము.
- Jeremiah 29:2 యిర్మీయా 29:2యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులును, శిల్పకారులును, కంసాలులును యెరూషలేమును విడిచి వెళ్లిన తరువాత ప్రవక్తయైన యిర్మీయా పత్రికలో లిఖించి, యూదారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరు నొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశాచేతను,
- Daniel 9:12 దానియేలు 9:12యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోను జరుగలేదు; ఆయన మా మీదికిని, మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతులమీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి, తాను చెప్పిన మాటలు నెర వేర్చెను.
- 2 Kings 24:12 2 రాజులు 24:12అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులును అతని క్రింది అధిపతు లును అతని పరివారమును బయలువెళ్లి బబులోనురాజునొద్దకు రాగా బబులోనురాజు యేలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను.
- Ezekiel 22:27–31 యెహెజ్కేలు 22:27–31దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుష్యులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్లవలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు, యెహోవా ఏమియు సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా యీలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు, వట్టిసోదెగాండ్రయి జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపూతపూయువారై యున్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారముచేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడుచేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడ లేదు. కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారిమీదికి రప్పించి నా ఉగ్రతాగ్నిచేత వారిని దహింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- 2 Kings 24:15 2 రాజులు 24:15అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేమునుండి బబులోను పురమునకు తీసికొనిపోయెను.
- Micah 7:1–5 మీకా 7:1–5వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఏలాగుండునో నా స్థితి ఆలాగే యున్నది. ద్రాక్షపండ్ల గెల యొకటియు లేకపోయెను, నా ప్రాణమున కిష్టమైన యొక క్రొత్త అంజూరపుపండైనను లేకపోయెను. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే; ప్రతిమనుష్యుడును కిరాతుడై తన సహోదరునికొరకు వలలను ఒగ్గును. రెండు చేతులతోను కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. ఆలాగున వారు ఏకపట్టుగానుండి దాని ముగింతురు. వారిలో మంచివారు ముండ్లచెట్టువంటివారు, వారిలో యథార్థ వంతులు ముండ్లకంచెకంటెను ముండ్లు ముండ్లుగా నుందురు, నీ కాపరుల దినము నీవు శిక్షనొందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము.
- Daniel 9:8 దానియేలు 9:8ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును ముఖము చిన్న బోవునట్లుగా సిగ్గే తగియున్నది.