Jeremiah · chapter 6 · verse 2
Jeremiah 6:2 in Telugu
సుందరియు సుకుమారియునైన సీయోను కుమార్తెను పెల్లగించుచున్నాను.
Sundariyu sukumaariyunaina seeyonu kumaartenu pellaginchuchunnaanu.
Jeremiah 6:2 in English
- King James Version (KJV)
- I have likened the daughter of Zion to a comely and delicate [woman].
- World English Bible (WEB)
- I will cut off the beautiful and delicate one, the daughter of Zion.
- American Standard Version (ASV)
- The comely and delicate one, the daughter of Zion, will I cut off.
- Bible in Basic English (BBE)
- The fair and delicate one, the daughter of Zion, will be cut off by my hand.
- Darby Translation (DBY)
- The comely and delicate one do I cut off, the daughter of Zion.
- Webster's Bible (WBS)
- I have likened the daughter of Zion to a comely and delicate [woman] .
- Young's Literal Translation (YLT)
- The comely and the delicate one I have cut off, The daughter of Zion.
Read in context
- 1బెన్యామీనీయులారా, యెరూషలేములో నుండి పారి పోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి, కీడు ఉత్తర దిక్కునుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది.
- 2సుందరియు సుకుమారియునైన సీయోను కుమార్తెను పెల్లగించుచున్నాను.
- 3గొఱ్ఱెల కాపరులు తమ మందలతో ఆమెయొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టు తమ గుడారములను వేయుదురు, ప్రతివాడును తన కిష్టమైనచోట మందను మేపును.
- 4ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి; లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ, ప్రొద్దు గ్రుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి.
Cross references
- Jeremiah 4:31 యిర్మీయా 4:31ప్రసవవేదనపడు స్త్రీ కేకలువేయునట్లు, తొలికానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలువేయునట్లు సీయోనుకుమార్తె అయ్యో, నాకు శ్రమ, నరహంతకులపాలై నేను మూర్చిల్లుచున్నాను అని యెగరోజుచు చేతులార్చుచు కేకలువేయుట నాకు వినబడుచున్నది.
- Isaiah 1:8 యెషయా 1:8ద్రాక్షతోటలోని గుడిసెవలెను దోసపాదులలోని పాకవలెను ముట్టడి వేయబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడియున్నది.
- Lamentations 2:13 విలాపవాక్యములు 2:13యెరూషలేము కుమారీ, ఎట్టిమాటలచేత నిన్ను హెచ్చరించుదును? దేనితో నిన్ను సాటిచేయుదును? సీయోను కుమారీ, కన్యకా, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడెవడు?
- Isaiah 3:16–17 యెషయా 3:16–17మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు; కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి మానమును బయలుపరచును.
- Lamentations 2:1 విలాపవాక్యములు 2:1ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశమునుండి భూమిమీదికి పడవేసెను కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసికొనకపోయెను.