Lamentations · chapter 1 · verse 10
Lamentations 1:10 in Telugu
దాని మనోహరమైన వస్తువులన్నియు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని యెవరినిగూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనములవారు దాని పరిశుద్ధస్థలమున ప్రవేశించి యుండుట అది చూచుచునేయున్నది
Daani manoharamaina vastuvulanniyu shatruvula chetilo chikkenu nee samaajamulo praveshimpakoodadani yevarinigoorchi aajnyaapinchitivo aa janamulavaaru daani parishuddhasthalamuna praveshinchi yunduta adi choochuchuneyunnadi
Lamentations 1:10 in English
- King James Version (KJV)
- The adversary hath spread out his hand upon all her pleasant things: for she hath seen [that] the heathen entered into her sanctuary, whom thou didst command [that] they should not enter into thy congregation.
- World English Bible (WEB)
- The adversary has spread out his hand on all her pleasant things; for she has seen that the nations have entered into her sanctuary, concerning whom you commanded that they should not enter into your assembly.
- American Standard Version (ASV)
- The adversary hath spread out his hand upon all her pleasant things: For she hath seen that the nations are entered into her sanctuary, Concerning whom thou didst command that they should not enter into thine assembly.
- Bible in Basic English (BBE)
- The hand of her hater is stretched out over all her desired things; for she has seen that the nations have come into her holy place, about whom you gave orders that they were not to come into the meeting of your people.
- Darby Translation (DBY)
- The adversary hath spread out his hand upon all her precious things; for she hath seen the nations enter into her sanctuary, concerning whom thou didst command that they should not enter into thy congregation.
- Webster's Bible (WBS)
- The adversary hath spread out his hand upon all her pleasant things: for she hath seen [that] the heathen entered into her sanctuary, whom thou didst command [that] they should not enter into thy congregation.
- Young's Literal Translation (YLT)
- His hand spread out hath an adversary On all her desirable things, For she hath seen — Nations have entered her sanctuary, Concerning which Thou didst command, 'They do not come into the assembly to thee.'
Read in context
- 8యెరూషలేము ఘోరమైన పాపముచేసెను అందుచేతను అది అపవిత్రురాలాయెను దాని ఘనపరచిన వారందరు దాని మానమును చూచి దాని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది
- 9దాని యపవిత్రత దాని చెంగులమీద నున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసికొనక యుండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దాని నాదరించువాడొకడును లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుటచేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము.
- 10దాని మనోహరమైన వస్తువులన్నియు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని యెవరినిగూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనములవారు దాని పరిశుద్ధస్థలమున ప్రవేశించి యుండుట అది చూచుచునేయున్నది
- 11దాని కాపురస్థులందరు నిట్టూర్పు విడుచుచు ఆహా రము వెదకుదురు తమ ప్రాణసంరక్షణకొరకు తమ మనోహరమైన వస్తువుల నిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని దృష్టించి చూడుము.
- 12త్రోవను నడుచువారలారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండకోప దినమున నాకు కలుగజేసిన శ్రమవంటి శ్రమ మరి ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి.
Cross references
- Deuteronomy 23:3 ద్వితీయోపదేశకాండము 23:3అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.
- Jeremiah 51:51 యిర్మీయా 51:51మేము దూషణవాక్యము విని సిగ్గుపడియున్నాము అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధస్థలములలోనికి వచ్చియున్నారు మా ముఖములు తెల్లబోవుచున్నవి
- Isaiah 64:10–11 యెషయా 64:10–11నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.
- Psalm 74:4–8 కీర్తనలు 74:4–8నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించు చున్నారు విజయధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు దట్టమైన చెట్ల గుబురుమీద జనులు గొడ్డండ్ల నెత్తి నట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరుగగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామమందిరమును నేల పడగొట్టి అపవిత్ర పరచు దురు. దేవుని మందిరములను బొత్తిగా అణగద్రొక్కుద మనుకొని దేశములోని వాటినన్నిటిని వారు కాల్చియున్నారు.
- Lamentations 1:7 విలాపవాక్యములు 1:7యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సు నంతటిని జ్ఞాపకము చేసికొనుచున్నది దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయము చేయువారెవరును లేక దాని జనము శత్రువుచేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతిదినములనుబట్టి దాని నపహాస్యము చేసిరి.
- Nehemiah 13:1 నెహెమ్యా 13:1ఆ దినమందు వారు మోషేగ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవునియొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు.
- Jeremiah 20:5 యిర్మీయా 20:5ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభ మంతయు దాని అమూల్యవస్తువులన్నియు యూదా రాజుల నిధులన్నియు నేనప్పగింతును, వారి శత్రువుల చేతికే వాటి నప్పగింతును, శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసికొనిపోవుదురు.
- Ezekiel 7:22 యెహెజ్కేలు 7:22వారిని చూడ కుండ నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధిస్థానమును అపవిత్రపరచుదురు, దొంగలు చొరబడి దానిని అపవిత్ర పరచుదురు.
- Mark 13:14 మార్కు 13:14మరియు నాశకరమైన హేయవస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు చదువువాడు గ్రహించుగాకయూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను;
- Jeremiah 15:13 యిర్మీయా 15:13నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయములేకుండ నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను.
- Ezekiel 44:7 యెహెజ్కేలు 44:7ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నా కర్పించునప్పుడు నా పరిశుద్ధస్థలములో ఉండి దాని నపవిత్రపరచునట్లు హృదయమందును, శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొనిరాగా వారు మీ హేయ క్రియలన్నిటిని ఆధారముచేసికొని నా నిబంధనను భంగ పరచిరి.
- Ezekiel 9:7 యెహెజ్కేలు 9:7ఆయనమందిరమును అపవిత్రపరచుడి, ఆవర ణములను హతమైనవారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణములోని వారిని హతము చేయసాగిరి.