Lamentations · chapter 1 · verse 2
Lamentations 1:2 in Telugu
రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడును లేడు దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి.
Raatriyandu adi bahugaa edchuchunnadi kanneeru daani chempalameeda kaaruchunnadi daani vitakaandrandarilo daani nodaarchuvaadokadunu ledu daani chelikaandrandaru daani mosapuchchiri vaaru daaniki shatruvulairi.
Lamentations 1:2 in English
- King James Version (KJV)
- She weepeth sore in the night, and her tears [are] on her cheeks: among all her lovers she hath none to comfort [her:] all her friends have dealt treacherously with her, they are become her enemies.
- World English Bible (WEB)
- She weeps bitterly in the night. Her tears are on her cheeks. Among all her lovers she has no one to comfort her. All her friends have dealt treacherously with her. They have become her enemies.
- American Standard Version (ASV)
- She weepeth sore in the night, and her tears are on her cheeks; Among all her lovers she hath none to comfort her: All her friends have dealt treacherously with her; they are become her enemies.
- Bible in Basic English (BBE)
- She is sorrowing bitterly in the night, and her face is wet with weeping; among all her lovers she has no comforter: all her friends have been false to her, they have become her haters.
- Darby Translation (DBY)
- She weepeth sore in the night, and her tears are on her cheeks; among all her lovers she hath no comforter; all her friends have dealt treacherously with her, they are become her enemies.
- Webster's Bible (WBS)
- She weepeth bitterly in the night, and her tears [are] on her cheeks: among all her lovers she hath none to comfort [her] : all her friends have dealt treacherously with her, they are become her enemies.
- Young's Literal Translation (YLT)
- She weepeth sore in the night, And her tear [is] on her cheeks, There is no comforter for her out of all her lovers, All her friends dealt treacherously by her, They have been to her for enemies.
Read in context
- 1జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖా క్రాంతమాయెను? అది విధవరాలివంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తెయైనది ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను?
- 2రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడును లేడు దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి.
- 3యూదా బాధనొంది దాసురాలై చెరలోనికి పోయియున్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతినొందక పోయెను దానితరుమువారందరు ఇరుకుచోట్లదాని కలిసికొందురు. నియామక కూటములకు ఎవరును రారు గనుక
- 4సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నియు పాడైపోయెను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకులభరితురాలాయెను.
Cross references
- Psalm 6:6 కీర్తనలు 6:6నేను మూలుగుచు అలసియున్నానుప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది.
- Micah 7:5 మీకా 7:5స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము.
- Psalm 77:2–6 కీర్తనలు 77:2–6నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాప బడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్నది. దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా. ) నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను.
- Job 19:13–14 యోబు 19:13–14ఆయన నా సోదరజనమును నాకు దూరము చేసియున్నాడు నా నెళవరులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నాయొద్దకు రాకయున్నారు నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయియున్నారు.
- Lamentations 1:16–17 విలాపవాక్యములు 1:16–17వీటినిబట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు ఒలుకుచున్నది నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్థులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి. ఆదరించువాడులేక సీయోను చేతులు చాపుచున్నది యెహోవా యాకోబునకు చుట్టునున్నవారిని విరోధులైయుండ నియమించియున్నాడు యెరూషలేము వారికి హేయమైనదాయెను.
- Lamentations 1:9 విలాపవాక్యములు 1:9దాని యపవిత్రత దాని చెంగులమీద నున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసికొనక యుండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దాని నాదరించువాడొకడును లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుటచేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము.
- Lamentations 1:19 విలాపవాక్యములు 1:19నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి నా యాజకులును నా పెద్దలును ప్రాణసంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచినవారైరి.
- Jeremiah 22:20–22 యిర్మీయా 22:20–22నీ విటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలువేయుము; బాషానులో బిగ్గరగా అరువుము, అబారీమునుండి కేకలువేయుము. నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గానినేను విననని నీవంటివి; నామాట వినకపోవుటే నీ బాల్యమునుండి నీకు వాడుక. నీ కాపరులందరు గాలి పీల్చుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు, నీ చెడుతనమంతటినిబట్టి నీవు అవమానమునొంది సిగ్గుపడుదువు.
- Jeremiah 30:14 యిర్మీయా 30:14నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు.
- Jeremiah 9:1 యిర్మీయా 9:1నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.
- Jeremiah 4:30 యిర్మీయా 4:30దోచుకొన బడినదానా, నీవేమి చేయుదువు? రక్త వర్ణవస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణ ములు ధరించి కాటుకచేత నీ కన్నులు పెద్దవిగా చేసి కొనుచున్నావే; నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే; నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయ జూచుచున్నారు.
- Lamentations 1:21 విలాపవాక్యములు 1:21నేను నిట్టూర్పు విడుచుట విని నన్నాదరించువాడొకడును లేడాయెను నీవు నాకు ఆపద కలుగజేసితివన్న వార్త నా విరోధులందరు విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలియుండెదరు.