Leviticus · chapter 15 · verse 27
Leviticus 15:27 in Telugu
వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
Vaatini muttu prativaadu apavitrudu. Vaadu tana battalu udukukoni neellato snaanamuchesi saayankaalamuvaraku apavitrudai yundunu.
Leviticus 15:27 in English
- King James Version (KJV)
- And whosoever toucheth those things shall be unclean, and shall wash his clothes, and bathe [himself] in water, and be unclean until the even.
- World English Bible (WEB)
- Whoever touches these things shall be unclean, and shall wash his clothes and bathe himself in water, and be unclean until the evening.
- American Standard Version (ASV)
- And whosoever toucheth those things shall be unclean, and shall wash his clothes, and bathe himself in water, and be unclean until the even.
- Bible in Basic English (BBE)
- And anyone touching these things will be unclean, and his clothing will have to be washed and his body bathed in water and he will be unclean till evening.
- Darby Translation (DBY)
- And whoever toucheth them shall be unclean, and shall wash his clothes, and bathe in water, and be unclean until the even.
- Webster's Bible (WBS)
- And whoever toucheth those things shall be unclean, and shall wash his clothes, and bathe [himself] in water, and be unclean until the evening.
- Young's Literal Translation (YLT)
- and any one who is coming against them is unclean, and hath washed his garments, and hath bathed with water, and been unclean till the evening.
Read in context
- 25ఒక స్త్రీ కడగా ఉండుకాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంక అనేకదినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలోవలెనే ఆ స్రావదినములన్నియు ఉండును, ఆమె అపవిత్రురాలు.
- 26ఆమె స్రావదినములన్నియు ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచమువలె ఉండ వలెను. ఆమె దేనిమీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రతవలె అపవిత్రమగును.
- 27వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
- 28ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైనయెడల ఆమె యేడుదినములు లెక్కించు కొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును.
- 29ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తేవలెను.
Cross references
- Ezekiel 36:29 యెహెజ్కేలు 36:29మీ సకల మైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరవురానియ్యక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును.
- Leviticus 15:5–8 లేవీయకాండము 15:5–8వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. అట్టివాడు దేనిమీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును. స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును. స్రావముగల వాడు పవిత్రునిమీద ఉమ్మివేసినయెడల వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
- Ezekiel 36:25 యెహెజ్కేలు 36:25మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.
- 1 Peter 1:18–19 1 పేతురు 1:18–19పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా
- 1 John 1:7 1 యోహాను 1:7అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
- Leviticus 15:13 లేవీయకాండము 15:13స్రావముగలవాడు తన స్రావమునుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకు కొని పారు నీటితో ఒడలును కడుగుకొని పవిత్రు డగును.
- Zechariah 13:1 జెకర్యా 13:1ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించు టకై దావీదు సంతతివారికొరకును, యెరూషలేము నివా సులకొరకును ఊట యొకటి తియ్యబడును.
- Hebrews 10:22 హెబ్రీయులకు 10:22మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్ని ధానమునకు చేరుదము.
- Hebrews 9:14 హెబ్రీయులకు 9:14నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.
- Leviticus 15:21 లేవీయకాండము 15:21ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును.
- Leviticus 17:15–16 లేవీయకాండము 17:15–16మరియు కళే బరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశ మందు పుట్టినవాడేమి పరదేశియేమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయం కాలమువరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండినయెడల వాడు తన దోషశిక్షను భరించును.