Leviticus · chapter 21 · verse 9
Leviticus 21:9 in Telugu
మరియు యాజకుని కుమార్తె జారత్వమువలన తన్ను అపవిత్రపరచు కొనినయెడల ఆమె తన తండ్రిని అపవిత్ర పరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను.
Mariyu yaajakuni kumaarte jaaratvamuvalana tannu apavitraparachu koninayedala aame tana tandrini apavitra parachunadi. Agnito aamenu dahimpavalenu.
Leviticus 21:9 in English
- King James Version (KJV)
- And the daughter of any priest, if she profane herself by playing the whore, she profaneth her father: she shall be burnt with fire.
- World English Bible (WEB)
- “‘The daughter of any priest, if she profanes herself by playing the prostitute, she profanes her father. She shall be burned with fire.
- American Standard Version (ASV)
- And the daughter of any priest, if she profane herself by playing the harlot, she profaneth her father: she shall be burnt with fire.
- Bible in Basic English (BBE)
- And if the daughter of a priest makes herself common and by her loose behaviour puts shame on her father, let her be burned with fire.
- Darby Translation (DBY)
- And the daughter of any priest, if she profane herself by playing the whore, she profaneth her father: she shall be burned with fire.
- Webster's Bible (WBS)
- And the daughter of any priest, if she shall profane herself by lewdness, she profaneth her father: she shall be burnt with fire.
- Young's Literal Translation (YLT)
- 'And a daughter of any priest when she polluteth herself by going a-whoring — her father she is polluting; with fire she is burnt.
Read in context
- 7వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలినేగాని పెండ్లిచేసికొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసికొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు.
- 8అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచ వలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను.
- 9మరియు యాజకుని కుమార్తె జారత్వమువలన తన్ను అపవిత్రపరచు కొనినయెడల ఆమె తన తండ్రిని అపవిత్ర పరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను.
- 10ప్రధానయాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తలమీద అభిషేకతైలము పోయబడునో, యాజకవస్త్రములు వేసికొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు; తన బట్టలను చింపుకొనరాదు;
- 11అతడు శవముదగ్గరకు పోరాదు; తన తండ్రి శవమువలననే గాని తన తల్లి శవమువలననే గాని తన్ను అపవిత్రపరచుకొన రాదు.
Cross references
- Genesis 38:24 ఆదికాండము 38:24రమారమి మూడు నెలలైన తరువాత నీ కోడలగు తామారు జారత్వము చేసెను; అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతియైనదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా - ఆమెను బయటికి తీసికొనిరండి, ఆమెను కాల్చి వేయవలెనని చెప్పెను.
- Leviticus 19:29 లేవీయకాండము 19:29మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతోనిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభి చారిణియగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు.
- 1 Samuel 2:17 1 సమూయేలు 2:17అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్య పడుటకు ఆ ¸యౌవనులు కారణమైరి, గనుక వారిపాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను.
- Malachi 2:3 మలాకీ 2:3మిమ్మునుబట్టి విత్తనములు చెరిపి వేతును, మీ ముఖములమీద పేడవేతును, పండుగలలో మీరర్పించిన పశువులపేడ వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు
- 1 Samuel 2:34 1 సమూయేలు 2:34నీ యిద్దరు కుమారులైన హొఫ్నీకిని ఫీనెహాసునకును సంభ వించునని నేను చెప్పినదానికి నీకు సూచనగా నుండును. ఒక్క నాటియందే వారిద్దరు మరణమవుదురు.
- Joshua 7:25 యెహోషువ 7:25అప్పుడు యెహోషువనీవేల మమ్మును బాధ పరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరు వానిని రాళ్లతో చావగొట్టిరి;
- Matthew 11:20–24 మత్తయి 11:20–24పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొంది యుందురు. విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును. విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.
- Isaiah 33:14 యెషయా 33:14సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్నవాటితో నివసించును?
- 1 Timothy 3:4–5 1 తిమోతికి 3:4–5సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను. ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?
- Joshua 7:15 యెహోషువ 7:15అప్పుడు శపిత మైనది యెవనియొద్ద దొరుకునో వానిని వానికి కలిగినవారి నందరిని అగ్నిచేత కాల్చివేయవలెను, ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కా ర్యము చేసినవాడు అనెను.
- 1 Samuel 3:13–14 1 సమూయేలు 3:13–14తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొను చున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ యింటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యముచేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము జేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞా పించితిని.
- Ezekiel 9:6 యెహెజ్కేలు 9:6అందరు నశించునట్లు ఎవరిని విడిచిపెట్టక, పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని, ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతముచేయ మొదలు పెట్టగా