Leviticus · chapter 23 · verse 20
Leviticus 23:20 in Telugu
యాజకుడు ప్రథమఫల ముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతి ష్ఠింపబడినవై యాజకునివగును.
Yaajakudu prathamaphala mula rottelato vaatini aa rendu pottellanu yehovaa sannidhini allaadimpavalenu. Avi yehovaaku prati shthimpabadinavai yaajakunivagunu.
Leviticus 23:20 in English
- King James Version (KJV)
- And the priest shall wave them with the bread of the firstfruits [for] a wave offering before the LORD, with the two lambs: they shall be holy to the LORD for the priest.
- World English Bible (WEB)
- The priest shall wave them with the bread of the first fruits for a wave offering before the LORD, with the two lambs. They shall be holy to the LORD for the priest.
- American Standard Version (ASV)
- And the priest shall wave them with the bread of the first-fruits for a wave-offering before Jehovah, with the two lambs: they shall be holy to Jehovah for the priest.
- Bible in Basic English (BBE)
- And these will be waved by the priest, with the bread of the first-fruits, for a wave offering to the Lord, with the two lambs: they will be holy to the Lord for the priest.
- Darby Translation (DBY)
- And the priest shall wave them with the bread of the first-fruits as a wave-offering before Jehovah, with the two he-lambs; they shall be holy to Jehovah, for the priest.
- Webster's Bible (WBS)
- And the priest shall wave them with the bread of the first-fruits [for] a wave-offering before the LORD, with the two lambs: they shall be holy to the LORD for the priest.
- Young's Literal Translation (YLT)
- and the priest hath waved them, besides the bread of the first -[fruits] — a wave-offering before Jehovah, besides the two lambs; they are holy to Jehovah for the priest;
Read in context
- 18మరియు మీరు ఆ రొట్టె లతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱెపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును.
- 19అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప పరిహారార్థబలిగా అర్పించి రెండు ఏడాది గొఱ్ఱెపిల్లలను సమాధానబలిగా అర్పింపవలెను.
- 20యాజకుడు ప్రథమఫల ముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతి ష్ఠింపబడినవై యాజకునివగును.
- 21ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనో పాధి యైన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్తనివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ.
- 22మీరు మీ పంటచేను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను; నేను మీ దేవుడ నైన యెహోవాను.
Cross references
- Deuteronomy 18:4 ద్వితీయోపదేశకాండము 18:4నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొఱ్ఱెల మొదటి బొచ్చును అతని కియ్యవలెను.
- Leviticus 23:17 లేవీయకాండము 23:17మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లా డించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము.
- Leviticus 10:14–15 లేవీయకాండము 10:14–15మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠిత మైన జబ్బను మీరు, అనగా నీవును నీతోపాటు నీ కుమారులును నీ కుమార్తెలును పవిత్రస్థలములో తిన వలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలోనుండి నీకును నీ కుమారులకును నియ మింపబడిన వంతులు. హోమద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించునట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసికొని రావలెను. నిత్యమైన కట్టడచొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను.
- Leviticus 8:29 లేవీయకాండము 8:29అది యెహోవాకు హోమము. మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠార్పణరూపమైన పొట్టేలులో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
- Numbers 18:8–12 సంఖ్యాకాండము 18:8–12మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెనుఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతి ష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చి యున్నాను; అభి షేకమునుబట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థ బలులన్ని టిలోను, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరి శుద్ధస్థలములో మీరు వాటిని తినవలెను. ప్రతి మగ వాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడి నదియు, ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నియు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటి నిచ్చితిని; నీ యింటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును. వారు యెహో వాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్త మైనదంతయు నీకిచ్చితిని.
- Exodus 29:24 నిర్గమకాండము 29:24అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటినన్నిటిని ఉంచి, అల్లాడింపబడు నైవే ద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.
- Leviticus 7:29–34 లేవీయకాండము 7:29–34నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఎవడు యెహో వాకు సమాధానబలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలోనుండి తాను అర్పించునది యెహోవా సన్నిధికి తేవలెను. అతడు తన చేతుల లోనే యెహోవాకు హోమద్రవ్యములను, అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను. యాజకుడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును. సమాధానబలిపశువులలోనుండి ప్రతిష్ఠార్పణముగా యాజ కునికి కుడి జబ్బనియ్యవలెను. అహరోను సంతతివారిలో ఎవడు సమాధానబలియగు పశువురక్తమును క్రొవ్వును అర్పించునో కుడిజబ్బ వానిదగును. ఏలయనగా ఇశ్రా యేలీయుల యొద్దనుండి, అనగా వారి సమాధానబలి ద్రవ్యములలోనుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసికొని, నిత్యమైన కట్టడచొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతివారికిని ఇచ్చియున్నాను.
- 1 Corinthians 9:11 1 కొరింథీయులకు 9:11మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా?
- Luke 2:14 లూకా 2:14సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
- Ephesians 2:14 ఎఫెసీయులకు 2:14ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.