Leviticus · chapter 9 · verse 10
Leviticus 9:10 in Telugu
దాని క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజముమీది వపను బలి పీఠముమీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
Daani krovvunu mootragranthulanu kaalejamumeedi vapanu bali peethamumeeda dahinchenu. Atlu yehovaa mosheku aajnyaapinchenu.
Leviticus 9:10 in English
- King James Version (KJV)
- But the fat, and the kidneys, and the caul above the liver of the sin offering, he burnt upon the altar; as the LORD commanded Moses.
- World English Bible (WEB)
- but the fat, and the kidneys, and the cover from the liver of the sin offering, he burned upon the altar, as the LORD commanded Moses.
- American Standard Version (ASV)
- but the fat, and the kidneys, and the caul from the liver of the sin-offering, he burnt upon the altar; as Jehovah commanded Moses.
- Bible in Basic English (BBE)
- But the fat and the kidneys and the fat on the liver of the sin-offering were burned by him on the altar as the Lord gave orders to Moses.
- Darby Translation (DBY)
- And the fat, and the kidneys, and the net above the liver, of the sin-offering, he burned on the altar, as Jehovah had commanded Moses.
- Webster's Bible (WBS)
- But the fat, and the kidneys, and the caul above the liver of the sin-offering, he burnt upon the altar; as the LORD commanded Moses.
- Young's Literal Translation (YLT)
- and the fat, and the kidneys, and the redundance of the liver, of the sin-offering, he hath made a perfume on the altar, as Jehovah hath commanded Moses;
Read in context
- 8కాబట్టి అహ రోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తనకొరకు పాపపరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను.
- 9అహరోను కుమారులు దాని రక్తమును అతనియొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ములమీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను.
- 10దాని క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజముమీది వపను బలి పీఠముమీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
- 11దాని మాంసమును చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను.
- 12అప్పుడతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తము నప్పగింపగా అతడు బలిపీఠముచుట్టు దానిని ప్రోక్షించెను.
Cross references
- Proverbs 23:26 సామెతలు 23:26నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము,
- Leviticus 4:34–35 లేవీయకాండము 4:34–35యాజ కుడు పాపపరిహారార్థబలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు సమాధానబలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహో వాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
- Isaiah 66:2 యెషయా 66:2అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చు చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట వినివణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.
- Leviticus 3:3–5 లేవీయకాండము 3:3–5అతడు ఆ సమాధాన బలి పశువుయొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్ర ములమీది క్రొవ్వంతటిని రెండు మూత్ర గ్రంధులను వాటిమీదను డొక్కలమీదనున్న క్రొవ్వును కాలే జముమీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింవలెను. అహరోను కుమారులు బలిపీఠముమీద, అనగా అగ్నిమీది కట్టె లపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింప వలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.
- Leviticus 8:16–17 లేవీయకాండము 8:16–17మోషే ఆంత్రములమీది క్రొవ్వంతటిని కాలేజముమీది వపను రెండు మూత్రగ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠముమీద దహించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను.
- Isaiah 53:10 యెషయా 53:10అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.
- Psalm 51:17 కీర్తనలు 51:17విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.
- Leviticus 3:9–11 లేవీయకాండము 3:9–11ఆ సమాధాన బలి పశువుయొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులమీది కాలేజముయొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలి పీఠముమీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము.
- Isaiah 57:15 యెషయా 57:15మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.
- Leviticus 4:8–12 లేవీయకాండము 4:8–12మరియు అతడు పాపపరిహారార్థబలిరూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దానినుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వంతటిని మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథుల పైనున్న కాలేజముమీది వపను సమాధాన బలియగు ఎద్దునుండి తీసినట్లు దీనినుండి తీయవలెను. యాజకుడు దహనబలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను. ఆ కోడెయొక్క శేషమంతయు, అనగా దాని చర్మము దాని మాంసమంతయు, దాని తల దాని కాళ్లు దాని ఆంత్రములు దాని పేడ పాళెము వెలుపల, బూడిదెను పారపోయు పవిత్ర స్థలమునకు తీసికొనిపోయి అగ్నిలో కట్టెలమీద కాల్చివేయవలెను. బూడిదె పారపోయు చోట దానిని కాల్చివేయవలెను.