Mark · chapter 10 · verse 31
Mark 10:31 in Telugu
మొదటి వారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు అనెను.
Modati vaaru anekulu kadapativaaraguduru, kadapativaaru modati vaaraguduru anenu.
Mark 10:31 in English
- King James Version (KJV)
- But many [that are] first shall be last; and the last first.
- World English Bible (WEB)
- But many who are first will be last, and the last first.”
- American Standard Version (ASV)
- But many [that are] first shall be last; and the last first.
- Bible in Basic English (BBE)
- But a great number who are first will be last: and those who are last will be first.
- Darby Translation (DBY)
- But many first shall be last, and the last first.
- Webster's Bible (WBS)
- But many [that are] first shall be last; and the last first.
- Young's Literal Translation (YLT)
- and many first shall be last, and the last first.'
Read in context
- 29అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు
- 30ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- 31మొదటి వారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు అనెను.
- 32వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్లుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయ మొందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన మరల పండ్రెండుగురు శిష్యులను పిలుచుకొని, తనకు సంభవింపబోవువాటిని వారికి తెలియజెప్పనారంభించి
- 33ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్య కుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింప బడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్య జనుల కప్పగించెదరు.
Cross references
- Matthew 19:30 మత్తయి 19:30మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగు దురు.
- Matthew 20:16 మత్తయి 20:16ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.
- Luke 13:30 లూకా 13:30ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటివారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను.
- Romans 9:30–33 రోమీయులకు 9:30–33అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్య జనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి; అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడి నను ఆ నియమమును అందుకొనలేదు, వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.
- Luke 18:11–14 లూకా 18:11–14పరిసయ్యుడు నిలువబడిదేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉప వాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.
- Matthew 21:31 మత్తయి 21:31అందుకు వారుమొదటివాడే అనిరి. యేసుసుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- Matthew 8:11–12 మత్తయి 8:11–12అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
- Acts 13:46–48 అపొస్తలుల కార్యములు 13:46–48అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరిదేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్య కమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి. అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.
- Luke 7:40–47 లూకా 7:40–47అందుకు యేసుసీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడుబోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థు లుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకుతోచుచున్నదని చెప్పగా ఆయననీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చి నప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టు కొనుట మాన లేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచె ముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి
- Luke 7:29–30 లూకా 7:29–30ప్రజలందరును సుంకరులును (యోహాను బోధ) విని, అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై, దేవుడు న్యాయవంతుడని యొప్పుకొనిరి గాని పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి.