Mark · chapter 7 · verse 1
Mark 7:1 in Telugu
యెరూషలేమునుండి వచ్చిన పరిసయ్యులును శాస్త్రులలో కొందరును ఆయనయొద్దకు కూడివచ్చి
Yerooshalemunundi vachchina parisayyulunu shaastrulalo kondarunu aayanayoddaku koodivachchi
Mark 7:1 in English
- King James Version (KJV)
- Then came together unto him the Pharisees, and certain of the scribes, which came from Jerusalem.
- World English Bible (WEB)
- Then the Pharisees and some of the scribes gathered together to him, having come from Jerusalem.
- American Standard Version (ASV)
- And there are gathered together unto him the Pharisees, and certain of the scribes, who had come from Jerusalem,
- Bible in Basic English (BBE)
- And there came together to him the Pharisees and certain of the scribes who had come from Jerusalem,
- Darby Translation (DBY)
- And the Pharisees and some of the scribes, coming from Jerusalem, are gathered together to him,
- Webster's Bible (WBS)
- Then came together to him the Pharisees, and certain of the scribes, who came from Jerusalem.
- Young's Literal Translation (YLT)
- And gathered together unto him are the Pharisees, and certain of the scribes, having come from Jerusalem,
Read in context
- 1యెరూషలేమునుండి వచ్చిన పరిసయ్యులును శాస్త్రులలో కొందరును ఆయనయొద్దకు కూడివచ్చి
- 2ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి.
- 3పరి సయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమునుబట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు.
Cross references
- Mark 3:22 మార్కు 3:22యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.
- Matthew 15:1–20 మత్తయి 15:1–20ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించు చున్నారని అడిగిరి అందుకాయన మీరును మీపారం పర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్ర మించుచున్నారు? తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి; నోటపడునది మనుష్యుని అపవిత్ర పరచదు గాని నోటనుండి వచ్చున దియే మనుష్యుని అప విత్రపరచునని వారితో చెప్పెను. అంతట ఆయన శిష్యులు వచ్చిపరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. అందుకుపేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా ఆయనమీరును ఇంతవరకు అవివేకులైయున్నారా? నోటిలోనికి పోవున దంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.
- Luke 11:53–54 లూకా 11:53–54ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోట నుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి, వెదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.
- Luke 5:17 లూకా 5:17ఒకనాడాయన బోధించుచుండగా, గలిలయ యూదయదేశముల ప్రతి గ్రామమునుండియు యెరూష లేమునుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశ కులును కూర్చుండియుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను.