Matthew · chapter 21 · verse 37
Matthew 21:37 in Telugu
తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను.
Tudaku naa kumaaruni sanmaaninchedaranukoni tana kumaaruni vaari yoddaku pampenu.
Matthew 21:37 in English
- King James Version (KJV)
- But last of all he sent unto them his son, saying, They will reverence my son.
- World English Bible (WEB)
- But afterward he sent to them his son, saying, ‘They will respect my son.’
- American Standard Version (ASV)
- But afterward he sent unto them his son, saying, They will reverence my son.
- Bible in Basic English (BBE)
- But after that he sent his son to them, saying, They will have respect for my son.
- Darby Translation (DBY)
- And at last he sent to them his son, saying, They will have respect for my son.
- Webster's Bible (WBS)
- But last of all he sent to them his son, saying, They will reverence my son.
- Young's Literal Translation (YLT)
- 'And at last he sent unto them his son, saying, They will reverence my son;
Read in context
- 35ఆ కాపులు అతని దాసులను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరి యొకనిమీద రాళ్లు రువ్విరి.
- 36మరల అతడు మునుపటి కంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి.
- 37తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను.
- 38అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందమురండని తమలో తాము చెప్పుకొని
- 39అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.
Cross references
- John 3:35–36 యోహాను 3:35–36తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి యున్నాడు. కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.
- John 3:16 యోహాను 3:16దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
- Zephaniah 3:7 జెఫన్యా 3:7దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాసస్థలము సర్వనాశము కాకుండునట్లు, నాయందు భయభక్తులు కలిగి శిక్షకులోబడుదురని నేననుకొంటిని గాని వారు దుష్క్రియలు చేయుటయందు అత్యాశగలవా రైరి.
- Luke 20:13 లూకా 20:13అప్పుడా ద్రాక్షతోట యజమానుడు నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును; ఒక వేళ వారు అతని సన్మానించెద రను కొనెను.
- Hebrews 1:1–2 హెబ్రీయులకు 1:1–2పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
- Matthew 3:17 మత్తయి 3:17మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
- Mark 12:6 మార్కు 12:6ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుకవారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను.
- Isaiah 5:4 యెషయా 5:4నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి దానికి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి?
- John 1:34 యోహాను 1:34ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చి తిననెను.
- Jeremiah 36:3 యిర్మీయా 36:3నేను యూదా వారికి చేయనుద్దేశించు కీడంతటినిగూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో.
- John 1:18 యోహాను 1:18ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.