Nehemiah · chapter 11 · verse 36
Nehemiah 11:36 in Telugu
మరియు లేవీయుల సంబంధ మైనవారిలో యూదా వంశస్థులలోనివారు బెన్యామీనీ యులమధ్య భాగములు పొందిరి.
Mariyu leveeyula sambandha mainavaarilo yoodaa vanshasthulalonivaaru benyaameenee yulamadhya bhaagamulu pondiri.
Nehemiah 11:36 in English
- King James Version (KJV)
- And of the Levites [were] divisions [in] Judah, [and] in Benjamin.
- World English Bible (WEB)
- Of the Levites, certain divisions in Judah settled in Benjamin’s territory.
- American Standard Version (ASV)
- And of the Levites, certain courses in Judah [were joined] to Benjamin.
- Bible in Basic English (BBE)
- And of the Levites, certain divisions in Judah were joined to Benjamin.
- Darby Translation (DBY)
- And of the Levites there were divisions of Judah [dwelling] in Benjamin.
- Webster's Bible (WBS)
- And of the Levites [were] divisions [in] Judah, [and] in Benjamin.
- Young's Literal Translation (YLT)
- And of the Levites, the courses of Judah [are] for Benjamin.
Read in context
- 34హాదీదులోను జెబోయిములోను నెబల్లాటులోను
- 35లోదులోను పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి.
- 36మరియు లేవీయుల సంబంధ మైనవారిలో యూదా వంశస్థులలోనివారు బెన్యామీనీ యులమధ్య భాగములు పొందిరి.
Cross references
- Genesis 49:7 ఆదికాండము 49:7వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.
- Joshua 21:1–45 యెహోషువ 21:1–45లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్ద కును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులయొద్దకును వచ్చి మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించెననగా ఇశ్రా యేలీయులు యెహోవా మాటచొప్పున తమ స్వాస్థ్యము లలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయుల కిచ్చిరి. వంతుచీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్ష ముగా యూదా గోత్రికులనుండియు, షిమ్యోను గోత్రి కులనుండియు, బెన్యామీను గోత్రికులనుండియు చీట్లవలన వచ్చినవి పదమూడు పట్టణములు. కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండియు, దాను గోత్రికుల నుండియు, మనష్షే అర్ధ గోత్రపువారినుండియు వంతుచీట్లవలన వచ్చినవి పది పట్ట ణములు. ఇశ్శాఖారు గోత్రికులనుండియు, ఆషేరు గోత్రికుల నుండియు, నఫ్తాలి గోత్రికులనుండియు, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపువారినుండియు చీట్లవలన గెర్షోనీయులకు కలిగినవి పదమూడు పట్టణములు. రూబేను గోత్రి కులనుండియు, గాదు గోత్రికులనుం డియు, జెబూలూను గోత్రికులనుండియు, వారి వంశములచొప్పున మెరారీయు లకు కలిగినవిపండ్రెండు పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయుల కిచ్చిరి. వారు యూదావంశస్థుల గోత్రములోను షిమ్యోనీ యుల గోత్రములోను చెప్పబడిన పేరులుగల యీ పట్టణ ములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహాతీయుల వంశము లలో అహరోను వంశకులకు కలిగినవి, ఏలయనగా మొదట చేతికివచ్చిన వంతుచీటి వారిది. యూదావంశస్థుల మన్య ములో వారికి కిర్యతర్బా, అనగా హెబ్రోను నిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టునున్న పొలమును వారి కిచ్చిరి. అయితే ఆ పట్టణముయొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్య ముగా ఇచ్చిరి. యాజకుడైన అహరోను సంతానపువారికి వారు నర హంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును దాని పొల మును లిబ్నాను దాని పొలమును యత్తీరును దాని పొల మును ఎష్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును దెబీరును దాని పొలమును ఆయినిని దాని పొల మును యుట్టయును దాని పొలమును బేత్షెమెషును దాని పొలమును, అనగా ఆ రెండు గోత్రములవారినుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి. బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకు లైన అహరోను వంశకుల పట్టణములన్నియు వాటి పొల ములు పోగా పదమూడు పట్టణములు. కహాతీయుల వంశపువారైన లేవీయులకు, అనగా కహాతు సంబంధులలో మిగిలినవారికి వంతుచీట్లవలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రమునుండి వారికియ్యబడెను. నాలుగు పట్టణములను, అనగా ఎఫ్రాయిమీ యుల మన్యదేశములో నరహంతకునికొరకు ఆశ్రయపట్టణ మైన షెకెమును దాని పొలమును గెజె రును దాని పొలమును కిబ్సాయిమును దాని పొలమును బేత్హోరోనును దాని పొలమును వారికిచ్చిరి. దాను గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా ఎత్తెకేను దాని పొలమును గిబ్బెతోనును దాని పొలమును అయ్యాలోనును దాని పొలమును గత్రి మ్మోనును దాని పొలమును వారికిచ్చిరి. రెండు పట్టణ ములును, అనగా మనష్షే అర్ధగోత్రికులనుండి తానా కును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొల మును ఇచ్చిరి. వాటి పొలములు గాక కహాతు సంబం ధులలో మిగిలినవారికి కలిగిన పట్టణములన్నియు పది. లేవీయుల వంశములలో గెర్షోనీయులకు రెండు పట్టణ ములను, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును బెయెష్టెరాను దాని పొలమును ఇచ్చిరి. ఇశ్శాఖారు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా కిష్యోనును దాని పొలమును దాబెరతును దాని పొలమును యర్మూతును దాని పొలమును ఏన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి. ఆషేరు గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా మిషెయలును దాని పొలమును అబ్దోనును దాని పొలమును హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి. నఫ్తాలి గోత్రికులనుండి మూడు పట్టణ ములను, అనగా నరహంతుకునికొరకు ఆశ్రయపట్టణమగు గలిలయలోని కెదెషును దాని పొలమును హమ్మోత్దోరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి. వారి వంశములచొప్పున గెర్షోనీయుల పట్టణములన్నియు వాటి పొలములుగాక పదమూడు పట్టణములు. లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలూను గోత్రములనుండి నాలుగు పట్టణములను, అనగా యొక్నెయాము దాని పొలమును కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలాలును దాని పొలమును ఇచ్చిరి. రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును యాహ సును దాని పొలమును కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి. గాదు గోత్రికుల నుండి నాలుగు పట్టణములును, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు గిలాదులోని రామోతును దాని పొల మును మహనయీమును దాని పొలమును హెష్బోనును దాని పొలమును యాజెరును దాని పొలమును ఇచ్చిరి. వారి వారి వంశములచొప్పున, అనగా లేవీయుల మిగిలిన వంశములచొప్పున అవన్నియు మెరారీయులకు కలిగిన పట్టణములు. వంతుచీటివలన వారికి కలిగిన పట్టణములు పండ్రెండు. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలుగాక లేవీయుల పట్టణములన్నియు నలువది యెనిమిది. ఆ పట్టణములన్నిటికి పొలములుండెను. ఆ పట్టణములన్నియు అట్లేయుండెను. యెహోవా ప్రమాణము చేసి వారి పితరుల కిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రా యేలీయుల కప్పగించెను. వారు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణముచేసిన వాటన్నిటి ప్రకారము అన్నిదిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరిని వారి చేతి కప్పగించియుండెను గనుక వారిలోనొకడును ఇశ్రాయేలీయులయెదుట నిలువ లేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను.
- 1 Chronicles 6:54–81 1 దినవృత్తాంతములు 6:54–81అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు; వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులనుబట్టి వారికి ఏర్పడిన నివాసస్థలములు ఇవి. యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను. అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు, హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు, ఆషాను దాని గ్రామ ములు, బేత్షెమెషు దాని గ్రామములు. మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు. కహాతు గోత్రీయులలో శేషించినవారికి ఎఫ్రాయిము గోత్రస్థానములోనుండియు, దాను అర్ధగోత్ర స్థానములోనుండియు, మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండియు చీటిచేత పది పట్టణములు ఇయ్యబడెను. గెర్షోను సంతతివారికి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారు గోత్రస్థానములోనుండియు, ఆషేరు గోత్రస్థాన ములోనుండియు, నఫ్తాలి గోత్రస్థానములో నుండియు బాషానునందుండు మనష్షే గోత్రస్థానములోనుండియు పదుమూడు పట్టణములు ఇయ్యబడెను. మెరారీయులకు వారి వంశములచొప్పున రూబేను గోత్రస్థానములోనుండియు, గాదు గోత్రస్థానములోనుండియు, జెబూలూను గోత్రస్థానములోనుండియు చీటిచేత పండ్రెండు పట్టణములు ఇయ్యబడెను. ఈ ప్రకారముగా ఇశ్రా యేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామ ములను ఇచ్చిరి. వారు చీటివేసి యూదావారి గోత్రస్థానములోనుండియు, షిమ్యోనీయుల గోత్రస్థానములో నుండియు, బెన్యామీనీయుల గోత్రస్థానములోనుండియు పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి. కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను. ఆశ్రయ పట్టణ ములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దావి గ్రామములును, గెజెరును దాని గ్రామములును, యొక్మె యామును దాని గ్రామములును బేత్హోరోనును దాని గ్రామములును, అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను. మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి. మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశస్థానములోనుండి బాషానునందలి గోలానుదాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు, ఇశ్శా ఖారుగోత్రస్థానములోనుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు, రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు, ఆషేరు గోత్రస్థాన ములోనుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు; నఫ్తాలి గోత్రస్థానములోనుండి గలి లయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను. మరియు మెరారీయులలో శేషించినవారికి జెబూ లూను గోత్రస్థానములోనుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరుదాని గ్రామములు, యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అర ణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు, కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు, గాదు గోత్ర స్థానములోనుండి గిలాదుయందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు, హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు, ఇయ్యబడెను.