Nehemiah · chapter 13 · verse 11
Nehemiah 13:11 in Telugu
నేను అధిపతులతో పోరాడిదేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి, వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని.
Nenu adhipatulato poraadidevuni mandiramunu enduku lakshyapettaledani adigi, vaarini samakoorchi tama sthalamulalo unchitini.
Nehemiah 13:11 in English
- King James Version (KJV)
- Then contended I with the rulers, and said, Why is the house of God forsaken? And I gathered them together, and set them in their place.
- World English Bible (WEB)
- Then I contended with the rulers, and said, “Why is God’s house forsaken?” I gathered them together, and set them in their place.
- American Standard Version (ASV)
- Then contended I with the rulers, and said, Why is the house of God forsaken? And I gathered them together, and set them in their place.
- Bible in Basic English (BBE)
- Then I made protests to the chiefs, and said, Why has the house of God been given up? And I got them together and put them in their places.
- Darby Translation (DBY)
- Then I contended with the rulers, and said, Why is the house of God forsaken? And I gathered them together and set them in their place.
- Webster's Bible (WBS)
- Then I contended with the rulers, and said, Why is the house of God forsaken? and I assembled them, and set them in their place.
- Young's Literal Translation (YLT)
- And I strive with the prefects, and say, 'Wherefore hath the house of God been forsaken?' and I gather them, and set them on their station;
Read in context
- 9పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరల తెప్పించితిని.
- 10మరియు లేవీయులకు రావలసిన పాళ్లు వారికి అందక పోవుటచేత సేవచేయు లేవీయులును గాయకులును తమ పొలములకు పారిపోయిరని తెలిసికొని
- 11నేను అధిపతులతో పోరాడిదేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి, వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని.
- 12అటుతరువాత యూదులందరును ధాన్య ద్రాక్షారసతైలములలో పదియవ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి.
- 13నమ్మకముగల మనుష్యులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానామీద నేను కాపరులగా నియమించితిని; వారి చేతిక్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను; మరియు తమ సహో దరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింప బడెను.
Cross references
- Nehemiah 10:39 నెహెమ్యా 10:39ఇశ్రా యేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షా రసమును నూనెను తేగా, సేవచేయు యాజకులును ద్వార పాలకులును గాయకులును వాటిని తీసి కొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.
- Nehemiah 13:17 నెహెమ్యా 13:17అంతట యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి మీ రెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు?
- Nehemiah 13:25 నెహెమ్యా 13:25అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసిమీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమా రులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించి
- Malachi 3:8–11 మలాకీ 3:8–11మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేనివిషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరం దురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరును నాయొద్ద దొంగిలుచునే యున్నారు, మీరు శాపగ్రస్తులై యున్నారు. నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనముచేయవు, మీ ద్రాక్షచెట్లు అకాలఫలములను రాల్పకయుండునని సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు
- Job 31:34 యోబు 31:34మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగానుండి ద్వారము దాటి బయలు వెళ్లక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన యెడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును
- Nehemiah 5:6–13 నెహెమ్యా 5:6–13వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని. అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించిమీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తికొలది మేము విడిపించితివిు, మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా? అని వారితో చెప్పగా, వారు ఏమియు చెప్పలేక ఊరకుండిరి. మరియు నేనుమీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందనుబట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింప కూడదా? నేనును నా బంధువులును నా దాసులునుకూడ ఆలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితివిు; ఆ అప్పు పుచ్చుకొనకుందము. ఈ దినములోనే వారియొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్షతోటలను ఒలీవతోటలను వారి యిండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షారసములోను నూనెలోను నూరవభాగమును వారికి మరల అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని. అందుకు వారునీవు చెప్పినప్రకారమే యివన్నియు ఇచ్చివేసి వారియొద్ద ఏమియు కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము చేయించితిని. మరియు నేను నా ఒడిని దులిపిఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన యింటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును; ఇటువలె వాడు దులిపి వేయబడి యేమియు లేనివాడుగా చేయబడునుగాకని చెప్పగా, సమాజకులందరు ఆలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరును ఈ మాట చొప్పుననే జరిగించిరి.
- 1 Samuel 2:17 1 సమూయేలు 2:17అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్య పడుటకు ఆ ¸యౌవనులు కారణమైరి, గనుక వారిపాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను.
- Proverbs 28:4 సామెతలు 28:4ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడు చుందురు ధర్మశాస్త్రము ననుసరించువారు వారితో పోరాడుదురు.