Numbers · chapter 29 · verse 35
Numbers 29:35 in Telugu
ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగానుండును. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులనేమియు చేయ కూడదు.
Enimidava dinamu meeku vratadinamugaanundunu. Appudu meeru jeevanopaadhiyaina panulanemiyu cheya koodadu.
Numbers 29:35 in English
- King James Version (KJV)
- On the eighth day ye shall have a solemn assembly: ye shall do no servile work [therein:]
- World English Bible (WEB)
- “‘On the eighth day you shall have a solemn assembly. You shall do no regular work;
- American Standard Version (ASV)
- On the eighth day ye shall have a solemn assembly: ye shall do no servile work;
- Bible in Basic English (BBE)
- On the eighth day let there be a holy meeting: you may do no field-work;
- Darby Translation (DBY)
- On the eighth day ye shall have a solemn assembly: no manner of servile work shall ye do.
- Webster's Bible (WBS)
- On the eighth day ye shall have a solemn assembly: [in it] ye shall do no servile work.
- Young's Literal Translation (YLT)
- 'On the eighth day a restraint ye have, ye do no servile work;
Read in context
- 33ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లల తోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను
- 34పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.
- 35ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగానుండును. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులనేమియు చేయ కూడదు.
- 36అందులో నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక మీరు యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,
- 37ఆ కోడెదూడతోను పొట్టేలుతోను గొఱ్ఱెపిల్లలతోను
Cross references
- Leviticus 23:36 లేవీయకాండము 23:36ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధసంఘ ముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.
- Revelation 7:9–17 ప్రకటన 7:9–17అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్; యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్. పెద్దలలో ఒకడుతెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును; వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.
- John 7:37–39 యోహాను 7:37–39ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.