Psalms · chapter 105 · verse 45
Psalm 105:45 in Telugu
తన ధర్మశాస్త్రవిధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి. యెహోవాను స్తుతించుడి.
Tana dharmashaastravidhulanu aacharinchunatlunu anyajanula bhoomulanu aayana vaarikappaginchenu janamula kashtaarjitamunu vaaru svaadheenaparachukoniri. Yehovaanu stutinchudi.
Psalm 105:45 in English
- King James Version (KJV)
- That they might observe his statutes, and keep his laws. Praise ye the LORD.
- World English Bible (WEB)
- that they might keep his statutes, and observe his laws. Praise the LORD!
- American Standard Version (ASV)
- That they might keep his statutes, And observe his laws. Praise ye Jehovah.
- Bible in Basic English (BBE)
- So that they might keep his orders, and be true to his laws. Give praise to the Lord.
- Darby Translation (DBY)
- That they might keep his statutes, and observe his laws. Hallelujah!
- Webster's Bible (WBS)
- That they might observe his statutes, and keep his laws. Praise ye the LORD.
- Young's Literal Translation (YLT)
- That they may observe His statutes, And His laws may keep. Praise ye Jehovah!
Read in context
- 43ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకొనినవారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించెను.
- 44వారు తన కట్టడలను గైకొనునట్లును
- 45తన ధర్మశాస్త్రవిధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి. యెహోవాను స్తుతించుడి.
Cross references
- Deuteronomy 4:40 ద్వితీయోపదేశకాండము 4:40మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను.
- Titus 2:14 తీతుకు 2:14ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
- Ephesians 2:8–10 ఎఫెసీయులకు 2:8–10మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.
- Deuteronomy 4:1 ద్వితీయోపదేశకాండము 4:1కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పిత రుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి.
- Psalm 106:1 కీర్తనలు 106:1యెహోవాను స్తుతించుడి యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.
- Revelation 19:3–4 ప్రకటన 19:3–4ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి.
- Psalm 150:1 కీర్తనలు 150:1యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి.
- Deuteronomy 6:21–25 ద్వితీయోపదేశకాండము 6:21–25నీవు నీ కుమారునితో ఇట్ల నుముమనము ఐగుప్తులో ఫరోకుదాసులమైయుండగా యెహోవా బాహుబలముచేత ఐగుప్తులోనుండి మనలను రప్పించెను. మరియు యెహోవా ఐగుప్తుమీదను ఫరో మీదను అతని యింటివారందరి మీదను బాధకరములైన గొప్ప సూచకక్రియలను అద్భుతములను మన కన్నుల యెదుట కనుపరచి, తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశ పెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించెను. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటివలె మనలను బ్రదికించు నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి యీ కట్టడల నన్నిటిని గైకొనవలెనని మన కాజ్ఞాపించెను. మన దేవుడైన యెహోవా మన కాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచు కొనునప్పుడు మనకు నీతి కలుగును.
- Ezekiel 36:24–28 యెహెజ్కేలు 36:24–28నేను అన్యజను లలోనుండి మిమ్మును తోడుకొని, ఆ యా దేశములలో నుండి సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను. నేను మీ పితరుల కిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులై యుందురు నేను మీ దేవుడనై యుందును.