Psalms · chapter 106 · verse 17
Psalm 106:17 in Telugu
భూమి నెరవిడిచి దాతానును మింగెను అది అబీరాము గుంపును కప్పివేసెను.
Bhoomi neravidichi daataanunu mingenu adi abeeraamu gumpunu kappivesenu.
Psalm 106:17 in English
- King James Version (KJV)
- The earth opened and swallowed up Dathan, and covered the company of Abiram.
- World English Bible (WEB)
- The earth opened and swallowed up Dathan, and covered the company of Abiram.
- American Standard Version (ASV)
- The earth opened and swallowed up Dathan, And covered the company of Abiram.
- Bible in Basic English (BBE)
- The earth opening put an end to Dathan, covering up Abiram and his band.
- Darby Translation (DBY)
- The earth opened and swallowed up Dathan, and covered the company of Abiram;
- Webster's Bible (WBS)
- The earth opened and swallowed up Dathan, and covered the company of Abiram.
- Young's Literal Translation (YLT)
- Earth openeth, and swalloweth up Dathan, And covereth over the company of Abiram.
Read in context
- 15వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను.
- 16వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి.
- 17భూమి నెరవిడిచి దాతానును మింగెను అది అబీరాము గుంపును కప్పివేసెను.
- 18వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను.
- 19హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి
Cross references
- Deuteronomy 11:6 ద్వితీయోపదేశకాండము 11:6రూబే నీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాము లకు చేసిన పనిని, భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారియొద్ద నున్న సమస్త జీవరాసు లను ఇశ్రాయేలీయులందరి మధ్యను మింగివేసిన రీతిని, చూడకయు ఎరుగకయునున్న మీ కుమారులతో నేను మాటలాడుట లేదని నేడు తెలిసికొనుడి.
- Numbers 26:10 సంఖ్యాకాండము 26:10ఆ సమూహపువారు మృతిబొంది నప్పుడు అగ్ని రెండువందల ఏబది మందిని భక్షించినందు నను, భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగి వేసినందునను, వారు దృష్టాంతములైరి.
- Numbers 16:29–33 సంఖ్యాకాండము 16:29–33మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందిన యెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్నుపంప లేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను. అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించ గానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళ ములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.