Psalms · chapter 108 · verse 9
Psalm 108:9 in Telugu
మోయాబు నేను కాళ్లు కడగుకొను పళ్లెము ఎదోముమీదికి నా చెప్పువిసరివేయుదును ఫిలిష్తియనుబట్టి జయోత్సవము చేసియున్నాను.
Moyaabu nenu kaallu kadagukonu pallemu edomumeediki naa cheppuvisariveyudunu philishtiyanubatti jayotsavamu chesiyunnaanu.
Psalm 108:9 in English
- King James Version (KJV)
- Moab [is] my washpot; over Edom will I cast out my shoe; over Philistia will I triumph.
- World English Bible (WEB)
- Moab is my wash pot. I will toss my sandal on Edom. I will shout over Philistia.”
- American Standard Version (ASV)
- Moab is my washpot; Upon Edom will I cast my shoe; Over Philistia will I shout.
- Bible in Basic English (BBE)
- Moab is my washpot; on Edom is the resting-place of my shoe; over Philistia will I send out a glad cry.
- Darby Translation (DBY)
- Moab is my wash-pot; upon Edom will I cast my sandal; over Philistia will I shout aloud.
- Webster's Bible (WBS)
- Moab [is] my washpot; over Edom will I cast out my shoe; over Philistia will I triumph.
- Young's Literal Translation (YLT)
- Moab [is] a pot for my washing, Upon Edom I cast my shoe, Over Philistia I shout habitually.
Read in context
- 7తన పరిశుద్ధత తోడని దేవుడు మాట యిచ్చియున్నాడు నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను.
- 8గిలాదు నాది మనష్షే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూదా నా రాజ దండము.
- 9మోయాబు నేను కాళ్లు కడగుకొను పళ్లెము ఎదోముమీదికి నా చెప్పువిసరివేయుదును ఫిలిష్తియనుబట్టి జయోత్సవము చేసియున్నాను.
- 10కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును?
- 11దేవా, నీవు మమ్మును విడనాడి యున్నావుగదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని యున్నావుగదా?
Cross references
- John 13:14 యోహాను 13:14కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే.
- Isaiah 14:29–32 యెషయా 14:29–32ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరువబడెనని అంతగా సంతోషింపకుము సర్పబీజమునుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతిబీదలైనవారు భోజనము చేయుదురు దరిద్రులు సురక్షితముగా పండుకొందురు కరవుచేత నీ బీజమును చంపెదను అది నీ శేషమును హతము చేయును. గుమ్మమా, ప్రలాపింపుమీ, పట్టణమా, అంగలార్పుమీ. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయియున్నావు ఉత్తరదిక్కునుండి పొగ లేచుచున్నది వచ్చువారి పటాలములలో వెనుకతీయువాడు ఒకడును లేడు. జనముల దూత కియ్యవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సీయోనును స్థాపించియున్నాడు ఆయన జనులలో శ్రమనొందినవారు దాని ఆశ్రయింతురు అని చెప్పవలెను.
- Ruth 4:7–8 రూతు 4:7–8ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమును గూర్చి గాని, క్రయవిక్రయములను గూర్చిగాని, ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువాని కిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడునీవు దానిని సంపాదించుకొను మని బోయజుతో చెప్పి తన చెప్పుతీయగా
- John 13:8 యోహాను 13:8పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను.
- Psalm 60:8–10 కీర్తనలు 60:8–10మోయాబు నేను కాళ్లు కడుగుకొను పళ్లెము ఎదోముమీద నా చెప్పు విసరివేయుదును ఫిలిష్తియా, నన్నుగూర్చి ఉత్సాహధ్వనిచేయుము. కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని యున్నావు గదా?
- 2 Samuel 21:15–22 2 సమూయేలు 21:15–22ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరల జరుగగా దావీదు తన సేవకులతోకూడ దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మ సిల్లెను. అప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇష్బిబేనోబ అను ఒకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది, వాని యీటె మూడువందల తులముల యెత్తు యిత్తడిగలదినేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీనిచూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇకమీదట మాతోకూడ యుద్ధమునకు రావద్దని అతనిచేత ప్రమాణము చేయించిరి. అటుతరువాత ఫిలిష్తీయులతో గోబుదగ్గర మరల యుద్ధము జరుగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫా యీయుల సంతతివాడగు సఫును చంపెను. తరువాత గోబుదగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగగా అక్కడ బేత్లెహేమీయుడైన యహరేయోరెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను; వాని యీటెకఱ్ఱనేతగాని దోనె అంత గొప్పది. ఇంకొక యుద్ధము గాతుదగ్గర జరిగెను. అక్కడ మంచి యెత్తరి యొక డుండెను, ఒక్కొక చేతికి ఆరేసి వ్రేళ్లును, ఇరువది నాలుగు వ్రేళ్లు అతని కుండెను. అతడు రెఫాయీయుల సంతతివాడు. అతడు ఇశ్రా యేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. ఈ నలుగురును గాతులోనున్న రెఫాయీయుల సంతతివారై దావీదువలనను అతని సేవకులవలనను హతులైరి.
- 2 Samuel 8:1–2 2 సమూయేలు 8:1–2దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరచుకొని వారి వశములోనుండి మెతెగమ్మాను పట్టుకొనెను. మరియు అతడు మోయాబీయులను ఓడించి, (పట్టుబడిన వారిని) నేలపొడుగున పండజేసి, తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగుననున్నవారు చావవలెననియు, ఒకతాడు పొడు గున నున్నవారు బ్రతుకవచ్చుననియు నిర్ణయించెను. అంతట మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి.