Psalms · chapter 119 · verse 134
Psalm 119:134 in Telugu
నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుష్యుల బలాత్కారమునుండి నన్ను విమోచింపుము.
Nee upadeshamulanu nenu anusarinchunatlu manushyula balaatkaaramunundi nannu vimochimpumu.
Psalm 119:134 in English
- King James Version (KJV)
- Deliver me from the oppression of man: so will I keep thy precepts.
- World English Bible (WEB)
- Redeem me from the oppression of man, so I will observe your precepts.
- American Standard Version (ASV)
- Redeem me from the oppression of man: So will I observe thy precepts.
- Bible in Basic English (BBE)
- Make me free from the cruel rule of man; then I will keep your orders.
- Darby Translation (DBY)
- Deliver me from the oppression of man; and I will keep thy precepts.
- Webster's Bible (WBS)
- Deliver me from the oppression of man: so will I keep thy precepts.
- Young's Literal Translation (YLT)
- Ransom me from the oppression of man, And I observe Thy precepts,
Read in context
- 132నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగునట్లు నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము.
- 133నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము.
- 134నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుష్యుల బలాత్కారమునుండి నన్ను విమోచింపుము.
- 135నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపుము.
- 136జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది.
Cross references
- Psalm 56:1–2 కీర్తనలు 56:1–2దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మింగ వలెనని యున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించు చున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నాకొరకు పొంచియున్నవారు నన్ను మింగ వలెనని యున్నారు
- Psalm 119:122 కీర్తనలు 119:122మేలుకొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురు గాక.
- Luke 1:74–75 లూకా 1:74–75అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని
- Ezekiel 11:17–20 యెహెజ్కేలు 11:17–20కాగా నీవు ఈ మాట ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా ఆ యా జనముల మధ్యనుండి నేను మిమ్మును సమకూర్చి, మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మును రప్పించి, ఇశ్రాయేలుదేశమును మీ వశము చేసెదను. వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచియున్న విగ్రహములను తీసివేసి, తాము చేసియున్న హేయక్రియలు చేయుట మానుదురు. వారు నా కట్ట డలను నా విధులను అనుసరించి గైకొను నట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులై యుందురు నేను వారికి దేవుడనై యుందును.
- Ezekiel 36:24–27 యెహెజ్కేలు 36:24–27నేను అన్యజను లలోనుండి మిమ్మును తోడుకొని, ఆ యా దేశములలో నుండి సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.
- Psalm 142:6 కీర్తనలు 142:6నేను చాలా క్రుంగియున్నాను నా మొఱ్ఱకు చెవి యొగ్గుము నన్ను తరుమువారు నాకంటె బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము.
- Psalm 56:13 కీర్తనలు 56:13నేను నీకు మ్రొక్కుకొని యున్నాను నేను నీకు స్తుతియాగముల నర్పించెదను.
- Acts 9:31 అపొస్తలుల కార్యములు 9:31కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.
- Psalm 105:43–45 కీర్తనలు 105:43–45ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకొనినవారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనునట్లును తన ధర్మశాస్త్రవిధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి. యెహోవాను స్తుతించుడి.