Psalms · chapter 138 · verse 4
Psalm 138:4 in Telugu
యెహోవా, భూరాజులందరు నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు.
Yehovaa, bhooraajulandaru neevu selavichchina maatalu vini neeku krutajnyataastutulu chellinchedaru.
Psalm 138:4 in English
- King James Version (KJV)
- All the kings of the earth shall praise thee, O LORD, when they hear the words of thy mouth.
- World English Bible (WEB)
- All the kings of the earth will give you thanks, LORD, for they have heard the words of your mouth.
- American Standard Version (ASV)
- All the kings of the earth shall give thee thanks, O Jehovah, For they have heard the words of thy mouth.
- Bible in Basic English (BBE)
- All the kings of the earth will give you praise, O Lord, when the words of your mouth come to their ears.
- Darby Translation (DBY)
- All the kings of the earth shall celebrate thee, Jehovah, when they have heard the words of thy mouth;
- Webster's Bible (WBS)
- All the kings of the earth shall praise thee, O LORD, when they hear the words of thy mouth.
- Young's Literal Translation (YLT)
- O Jehovah, all kings of earth confess Thee, When they have heard the sayings of Thy mouth.
Read in context
- 2నీ పరిశుద్ధాలయముతట్టు నేను నమస్కారము చేయు చున్నాను నీ నామమంతటికంటె నీవిచ్చిన వాక్యమును నీవు గొప్పచేసియున్నావు. నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకు కృతజ్ఞతా స్తుతులు నేను చెల్లించెదను.
- 3నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి.
- 4యెహోవా, భూరాజులందరు నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు.
- 5యెహోవా మహా ప్రభావముగలవాడని వారు యెహోవా మార్గములనుగూర్చి గానము చేసె దరు.
- 6యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.
Cross references
- Psalm 102:15 కీర్తనలు 102:15అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరు నీ మహిమకును భయపడెదరు
- Psalm 72:11 కీర్తనలు 72:11రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరు అతని సేవించెదరు.
- Psalm 22:27 కీర్తనలు 22:27భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు
- Psalm 22:22 కీర్తనలు 22:22నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను.
- Isaiah 60:3–5 యెషయా 60:3–5జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.
- Isaiah 60:16 యెషయా 60:16యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు.
- Revelation 21:24 ప్రకటన 21:24జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.
- Revelation 11:15 ప్రకటన 11:15ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలు ననెను.
- Isaiah 49:23 యెషయా 49:23రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కని పెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు.
- Psalm 102:22 కీర్తనలు 102:22వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడ వలెను సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును
- Psalm 51:13 కీర్తనలు 51:13అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులును నీ తట్టు తిరుగుదురు.
- Psalm 69:30–32 కీర్తనలు 69:30–32కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను ఎద్దుకంటెను, కొమ్ములును డెక్కలునుగల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము బాధపడువారు దాని చూచి సంతోషించుదురు దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక.