Psalms · chapter 33 · verse 8
Psalm 33:8 in Telugu
లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుప వలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను.
Lokulandaru yehovaayandu bhayabhaktulu nilupa valenu. Bhooloka nivaasulandaru aayanaku veravavalenu.
Psalm 33:8 in English
- King James Version (KJV)
- Let all the earth fear the LORD: let all the inhabitants of the world stand in awe of him.
- World English Bible (WEB)
- Let all the earth fear the LORD. Let all the inhabitants of the world stand in awe of him.
- American Standard Version (ASV)
- Let all the earth fear Jehovah: Let all the inhabitants of the world stand in awe of him.
- Bible in Basic English (BBE)
- Let the earth be full of the fear of the Lord; let all the people of the world be in holy fear of him.
- Darby Translation (DBY)
- Let all the earth fear Jehovah; let all the inhabitants of the world stand in awe of him.
- Webster's Bible (WBS)
- Let all the earth fear the LORD: let all the inhabitants of the world stand in awe of him.
- Young's Literal Translation (YLT)
- Afraid of Jehovah are all the earth, Of Him are all the inhabitants of the world afraid.
Read in context
- 6యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.
- 7సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే.
- 8లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుప వలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను.
- 9ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను.
- 10అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును.
Cross references
- Revelation 14:6–7 ప్రకటన 14:6–7అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశ మునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడుమీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.
- Psalm 96:9–10 కీర్తనలు 96:9–10పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది న్యాయమునుబట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి
- Revelation 15:4 ప్రకటన 15:4ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.
- Psalm 22:27 కీర్తనలు 22:27భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు
- Jeremiah 10:7–12 యిర్మీయా 10:7–12జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యము లన్నిటిలోను నీవంటివాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు; బొమ్మల పూజవలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తర్షీషునుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఉపాజునుండి బంగారమును తెత్తురు, అది పని వాని పనియేగదా; పోతపోయువాడు దాని చేసెను, నీల ధూమ్రవర్ణములుగల వస్త్రములు వాటికున్నవి, అవన్నియు నేర్పరులగు పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఈలాగు చెప్పవలెను ఆకాశమును భూమిని సృష్టింపని యీ దేవతలు భూమిమీద నుండ కుండను ఆకాశముక్రింద ఉండకుండను నశించును. ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.
- Psalm 76:7 కీర్తనలు 76:7నీవు, నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు?
- Psalm 67:7 కీర్తనలు 67:7దేవుడు మమ్మును దీవించును భూదిగంత నివాసులందరు ఆయనయందు భయభక్తులు నిలుపుదురు.
- Daniel 6:25–26 దానియేలు 6:25–26అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతట నివసించు సకలజనులకును రాష్ట్రములకును ఆ యా భాషలు మాట లాడువారికిని ఈలాగు వ్రాయించెను మీకు క్షేమాభి వృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలుయొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనముకానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును.
- Hebrews 12:29 హెబ్రీయులకు 12:29ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు.