Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 36 of 150 · 12 verses

Psalm 36 in Telugu

కీర్తనలు 36

  1. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె పలుకుచున్నది వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు.

    To the chief Musician, [A Psalm] of David the servant of the LORD. The transgression of the wicked saith within my heart, [that there is] no fear of God before his eyes.

  2. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టియెదుట వాని ముఖస్తుతి చేయుచున్నది.

    For he flattereth himself in his own eyes, until his iniquity be found to be hateful.

  3. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలుచేయను వాడు మానివేసి యున్నాడు.

    The words of his mouth [are] iniquity and deceit: he hath left off to be wise, [and] to do good.

  4. వాడు మంచముమీదనే పాపయోచనను యోచిం చును వాడు కానినడతలు నడచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు.

    He deviseth mischief upon his bed; he setteth himself in a way [that is] not good; he abhorreth not evil.

  5. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది.

    Thy mercy, O LORD, [is] in the heavens; [and] thy faithfulness [reacheth] unto the clouds.

  6. నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే

    Thy righteousness [is] like the great mountains; thy judgments [are] a great deep: O LORD, thou preservest man and beast.

  7. దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.

    How excellent [is] thy lovingkindness, O God! therefore the children of men put their trust under the shadow of thy wings.

  8. నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించు చున్నావు.

    They shall be abundantly satisfied with the fatness of thy house; and thou shalt make them drink of the river of thy pleasures.

  9. నీయొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచు చున్నాము.

    For with thee [is] the fountain of life: in thy light shall we see light.

  10. నిన్ను ఎరిగినవారియెడల నీ కృపను యథార్థహృదయులయెడల నీ నీతిని ఎడతెగక నిలుపుము.

    O continue thy lovingkindness unto them that know thee; and thy righteousness to the upright in heart.

  11. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనియ్యకుము.

    Let not the foot of pride come against me, and let not the hand of the wicked remove me.

  12. అదిగో పాపముచేయువారు అక్కడ పడియున్నారు లేవలేకుండ వారు పడద్రోయబడి యున్నారు.

    There are the workers of iniquity fallen: they are cast down, and shall not be able to rise.

All chapters of Psalms · Telugu Bible · Psalm 36 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.