Psalms · chapter 36 · verse 11
Psalm 36:11 in Telugu
గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనియ్యకుము.
Garvishthula paadamunu naa meediki raaniyyakumu bhaktiheenula chetini nannu paaradolaniyyakumu.
Psalm 36:11 in English
- King James Version (KJV)
- Let not the foot of pride come against me, and let not the hand of the wicked remove me.
- World English Bible (WEB)
- Don’t let the foot of pride come against me. Don’t let the hand of the wicked drive me away.
- American Standard Version (ASV)
- Let not the foot of pride come against me, And let not the hand of the wicked drive me away.
- Bible in Basic English (BBE)
- Let not the foot of pride come against me, or the hand of the evil-doers put me out of my place.
- Darby Translation (DBY)
- Let not the foot of pride come against me, and let not the hand of the wicked drive me away.
- Webster's Bible (WBS)
- Let not the foot of pride come against me, and let not the hand of the wicked remove me.
- Young's Literal Translation (YLT)
- Let not a foot of pride meet me, And a hand of the wicked let not move me.
Read in context
- 9నీయొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచు చున్నాము.
- 10నిన్ను ఎరిగినవారియెడల నీ కృపను యథార్థహృదయులయెడల నీ నీతిని ఎడతెగక నిలుపుము.
- 11గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనియ్యకుము.
- 12అదిగో పాపముచేయువారు అక్కడ పడియున్నారు లేవలేకుండ వారు పడద్రోయబడి యున్నారు.
Cross references
- Psalm 16:8 కీర్తనలు 16:8సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను.
- Isaiah 51:23 యెషయా 51:23నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.
- Psalm 123:3–4 కీర్తనలు 123:3–4యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతివిు అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మామీదికి అధికముగా వచ్చియున్నవి. మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము.
- Psalm 12:3–5 కీర్తనలు 12:3–5యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును. మా నాలుకలచేత మేము సాధించెదముమా పెదవులుమావి, మాకు ప్రభువు ఎవడని వారను కొందురు. బాధపడువారికి చేయబడిన బలాత్కారమును బట్టియుదరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Job 40:11–12 యోబు 40:11–12నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్టులైన వారినందరిని చూచి వారిని క్రుంగ జేయుము. గర్విష్టులైన వారిని చూచి వారిని అణగగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగ ద్రొక్కుము.
- Psalm 17:8–14 కీర్తనలు 17:8–14నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్నుకాపాడుమునన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుమునన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువులచేత చిక్కకుండనునీ రెక్కల నీడక్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరచుకొనియున్నారువారి నోరు గర్వముగా మాటలాడును. మా అడుగుజాడలను గురుతుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని యున్నారుమమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహమువలెను చాటైన స్థలములలో పొంచు కొదమసింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడ గొట్టుముదుష్టునిచేతిలోనుండి నీ ఖడ్గముచేత నన్ను రక్షింపుము లోకులచేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండినీ హస్తబలముచేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావువారు కుమారులు కలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు.
- Psalm 119:85 కీర్తనలు 119:85నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి.
- Romans 8:35–39 రోమీయులకు 8:35–39క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.
- Psalm 10:2 కీర్తనలు 10:2దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడువారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు గాక
- Psalm 119:51 కీర్తనలు 119:51గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి అయినను నీ ధర్మశాస్త్రమునుండి నేను తొలగక యున్నాను.
- Psalm 119:69 కీర్తనలు 119:69గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశ ములను అనుసరింతును.
- Psalm 119:122 కీర్తనలు 119:122మేలుకొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురు గాక.