Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 43 of 150 · 5 verses

Psalm 43 in Telugu

కీర్తనలు 43

  1. దేవా, నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యె మాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.

    Judge me, O God, and plead my cause against an ungodly nation: O deliver me from the deceitful and unjust man.

  2. నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింప నేల?

    For thou [art] the God of my strength: why dost thou cast me off? why go I mourning because of the oppression of the enemy?

  3. నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును.

    O send out thy light and thy truth: let them lead me; let them bring me unto thy holy hill, and to thy tabernacles.

  4. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనందసంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను

    Then will I go unto the altar of God, unto God my exceeding joy: yea, upon the harp will I praise thee, O God my God.

  5. నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.

    Why art thou cast down, O my soul? and why art thou disquieted within me? hope in God: for I shall yet praise him, [who is] the health of my countenance, and my God.

All chapters of Psalms · Telugu Bible · Psalm 43 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.