Psalms · chapter 79 · verse 12
Psalm 79:12 in Telugu
ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి యెదలోనికి ఏడంతలు నిందను కలుగజేయుము.
Prabhuvaa, maa poruguvaaru ninnu nindinchina nindaku pratigaa vaari yedaloniki edantalu nindanu kalugajeyumu.
Psalm 79:12 in English
- King James Version (KJV)
- And render unto our neighbours sevenfold into their bosom their reproach, wherewith they have reproached thee, O Lord.
- World English Bible (WEB)
- Pay back to our neighbors seven times into their bosom their reproach with which they have reproached you, Lord.
- American Standard Version (ASV)
- And render unto our neighbors sevenfold into their bosom Their reproach, wherewith they have reproached thee, O Lord.
- Bible in Basic English (BBE)
- And give punishment seven times over into the breast of our neighbours for the bitter words which they have said against you, O Lord.
- Darby Translation (DBY)
- And render unto our neighbours, sevenfold into their bosom, their reproach, wherewith they have reproached thee, O Lord.
- Webster's Bible (WBS)
- And render to our neighbors seven-fold into their bosom their reproach, with which they have reproached thee, O LORD.
- Young's Literal Translation (YLT)
- And turn Thou back to our neighbours, Sevenfold unto their bosom, their reproach, Wherewith they reproached Thee, O Lord.
Read in context
- 10వారి దేవుడెక్కడ నున్నాడని అన్యజనులు పలుక నేల? మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమునుగూర్చిన ప్రతి దండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము.
- 11చెరలోనున్నవాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడినవారిని కాపాడుము.
- 12ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి యెదలోనికి ఏడంతలు నిందను కలుగజేయుము.
- 13అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొఱ్ఱెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము.
Cross references
- Jeremiah 32:18 యిర్మీయా 32:18నీవు వేవేలమందికి కృపచూపుచు, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు.
- Genesis 4:15 ఆదికాండము 4:15అందుకు యెహోవా అతనితో కాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతిదండన యేడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను.
- Leviticus 26:21 లేవీయకాండము 26:21మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను.
- Proverbs 6:31 సామెతలు 6:31వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను.
- Psalm 74:18–22 కీర్తనలు 74:18–22యెహోవా, శత్రువులు నిన్ను దూషణచేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనుము. దుష్టమృగమునకు నీ గువ్వయొక్క ప్రాణము నప్ప గింపకుము శ్రమనొందు నీవారిని నిత్యము మరువకుము. లోకములోనున్న చీకటిగల చోటులు బలాత్కారుల నివాసములతో నిండియున్నవి. కాగా నిబంధనను జ్ఞాపకము చేసికొనుము నలిగినవానిని అవమానముతో వెనుకకు మరల నియ్య కుము. శ్రమ నొందువారును దరిద్రులును నీ నామము సన్నుతించుదురు గాక. దేవా, లెమ్ము నీ వ్యాజ్యెము నడుపుము అవివేకులు దినమెల్ల నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసికొనుము.
- Leviticus 26:28 లేవీయకాండము 26:28నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.
- Luke 6:38 లూకా 6:38క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.
- Psalm 44:16 కీర్తనలు 44:16నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది.
- Isaiah 65:5–7 యెషయా 65:5–7వారుమా దాపునకురావద్దు ఎడముగా ఉండుము నీకంటె మేము పరిశుద్ధులమని చెప్పుదురు; వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా యెదుట గ్రంథములో అది వ్రాయబడి యున్నది ప్రతికారముచేయక నేను మౌనముగా నుండను నిశ్చయముగా వారనుభవించునట్లు నేను వారికి ప్రతికారము చేసెదను. నిశ్చయముగా మీ దోషములనుబట్టియు మీ పితరుల దోషములనుబట్టియు అనగా పర్వతములమీద ఈ జనులు ధూపమువేసిన దానినిబట్టియు కొండలమీద నన్ను దూషించినదానినిబట్టియు మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతికారము కొలిచి పోయుదును.
- Psalm 74:10 కీర్తనలు 74:10దేవా, విరోధులు ఎందాక నిందింతురు? శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా?