Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 87 of 150 · 7 verses

Psalm 87 in Telugu

కీర్తనలు 87

  1. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతములమీద వేయబడియున్నది

    A Psalm [or] Song for the sons of Korah. His foundation [is] in the holy mountains.

  2. యాకోబు నివాసములన్నిటికంటె సీయోను గుమ్మ ములు యెహోవాకు ప్రియములై యున్నవి

    The LORD loveth the gates of Zion more than all the dwellings of Jacob.

  3. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్నుగూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. (సెలా. )

    Glorious things are spoken of thee, O city of God. Selah.

  4. రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను ఫిలిష్తీయ తూరు కూషులను చూడుము వీరు అచ్చట జన్మించిరని యందురు.

    I will make mention of Rahab and Babylon to them that know me: behold Philistia, and Tyre, with Ethiopia; this [man] was born there.

  5. ప్రతి జనము దానిలోనే జన్మించెననియు సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచెననియు సీయోనునుగూర్చి చెప్పుకొందురు.

    And of Zion it shall be said, This and that man was born in her: and the highest himself shall establish her.

  6. యెహోవా జనముల సంఖ్య వ్రాయించునప్పుడు ఈ జనము అక్కడ జన్మించెనని సెలవిచ్చును. (సెలా. )

    The LORD shall count, when he writeth up the people, [that] this [man] was born there. Selah.

  7. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నియు నీయందే యున్నవని వారం దురు.

    As well the singers as the players on instruments [shall be there:] all my springs [are] in thee.

All chapters of Psalms · Telugu Bible · Psalm 87 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.