Psalms · chapter 97 · verse 4
Psalm 97:4 in Telugu
ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది.
Aayana merupulu lokamunu prakaashimpajeyuchunnavi bhoomi daani choochi kampinchuchunnadi.
Psalm 97:4 in English
- King James Version (KJV)
- His lightnings enlightened the world: the earth saw, and trembled.
- World English Bible (WEB)
- His lightning lights up the world. The earth sees, and trembles.
- American Standard Version (ASV)
- His lightnings lightened the world: The earth saw, and trembled.
- Bible in Basic English (BBE)
- His bright flames give light to the world; the earth saw it with fear.
- Darby Translation (DBY)
- His lightnings lightened the world: the earth saw, and trembled.
- Webster's Bible (WBS)
- His lightnings enlightened the world: the earth saw, and trembled.
- Young's Literal Translation (YLT)
- Lightened have His lightnings the world, The earth hath seen, and is pained.
Read in context
- 2మేఘాంధకారములు ఆయనచుట్టు నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము.
- 3అగ్ని ఆయనకు ముందు నడచుచున్నది అది చుట్టునున్న ఆయన శత్రువులను కాల్చివేయు చున్నది.
- 4ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది.
- 5యెహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములు మైనమువలె కరగుచున్నవి.
- 6ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది
Cross references
- Psalm 77:18 కీర్తనలు 77:18నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను.
- Revelation 11:19 ప్రకటన 11:19మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
- Exodus 19:16–18 నిర్గమకాండము 19:16–18మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెము లోనుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను.
- Jeremiah 10:10 యిర్మీయా 10:10యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.
- Job 9:6 యోబు 9:6భూమిని దాని స్థలములో నుండి కదలించువాడుఆయనేదాని స్తంభములు అదరచేయువాడు ఆయనే
- Psalm 104:32 కీర్తనలు 104:32ఆయన భూమిని చూడగా అది వణకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును
- Psalm 114:7 కీర్తనలు 114:7భూమీ, ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణకుము
- Matthew 27:50–51 మత్తయి 27:50–51యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను;
- Psalm 144:5–6 కీర్తనలు 144:5–6యెహోవా, నీ ఆకాశమును వంచి దిగి రమ్ము పర్వతములు పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము.
- Revelation 19:11 ప్రకటన 19:11మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు
- Psalm 96:9 కీర్తనలు 96:9పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి.
- Matthew 28:2–3 మత్తయి 28:2–3ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను.