Zechariah · chapter 10 · verse 5
Zechariah 10:5 in Telugu
వారు యుద్ధముచేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలురవలె ఉందురు. యెహోవా వారికి తోడైయుండును గనుక వారు యుద్ధముచేయగా గుఱ్ఱములను ఎక్కువారు సిగ్గునొందుదురు.
Vaaru yuddhamucheyuchu veedhula buradalo shatruvulanu trokku paraakramashaaluravale unduru. Yehovaa vaariki todaiyundunu ganuka vaaru yuddhamucheyagaa gurramulanu ekkuvaaru siggunonduduru.
Zechariah 10:5 in English
- King James Version (KJV)
- And they shall be as mighty [men], which tread down [their enemies] in the mire of the streets in the battle: and they shall fight, because the LORD [is] with them, and the riders on horses shall be confounded.
- World English Bible (WEB)
- They will be as mighty men, treading down muddy streets in the battle. They will fight, because the LORD is with them. The riders on horses will be confounded.
- American Standard Version (ASV)
- And they shall be as mighty men, treading down [their enemies] in the mire of the streets in the battle; and they shall fight, because Jehovah is with them; and the riders on horses shall be confounded.
- Bible in Basic English (BBE)
- Together they will be like men of war, crushing down their haters into the earth of the streets in the fight; they will make war because the Lord is with them: and the horsemen will be shamed.
- Darby Translation (DBY)
- And they shall be as mighty men, treading down the mire of the streets in the battle; and they shall fight, for Jehovah is with them, and the riders on horses shall be put to shame.
- Webster's Bible (WBS)
- And they shall be as mighty [men] , who tread down [their enemies] in the mire of the streets in the battle: and they shall fight, because the LORD [is] with them, and the riders on horses shall be confounded.
- Young's Literal Translation (YLT)
- And they have been as heroes, Treading in mire of out-places in battle, And they have fought, for Jehovah [is] with them, And have put to shame riders of horses.
Read in context
- 3నా కోపాగ్ని మండుచు కాపరులమీద పడును, మేకలను నేను శిక్షించెదను, సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వములవంటివారినిగా చేయును.
- 4వారిలోనుండి మూల రాయి పుట్టును, మేకును యుద్ధపువిల్లును వారిచేత కలు గును, బాధించువాడు వారిలోనుండి బయలుదేరును,
- 5వారు యుద్ధముచేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలురవలె ఉందురు. యెహోవా వారికి తోడైయుండును గనుక వారు యుద్ధముచేయగా గుఱ్ఱములను ఎక్కువారు సిగ్గునొందుదురు.
- 6నేను యూదా వారిని బలశాలురుగా చేసెదను, యోసేపు సంతతివారికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలము ఇచ్చెదను, నేను వారియెడల జాలిపడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు.
- 7ఎఫ్రా యిమువారు బలాఢ్యులవంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించునట్లు వారు మనస్సున ఆనందింతురు, వారి బిడ్డలు దాని చూచి ఆనందపడుదురు, యెహోవాను బట్టివారు హృదయపూర్వకముగా ఉల్లసించు దురు.
Cross references
- Haggai 2:22 హగ్గయి 2:22రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.
- Zechariah 12:8 జెకర్యా 12:8ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్ష కుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను, దావీదు సంతతి వారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను ఉందురు.
- Romans 8:31–37 రోమీయులకు 8:31–37ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు? తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు? దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే; శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.
- Psalm 20:7 కీర్తనలు 20:7కొందరు రథములను బట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.
- Zechariah 9:13 జెకర్యా 9:13యూదావారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించునట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సీయోను కుమారు లను మీమీదికి రేపుచున్నాను.
- Isaiah 10:6 యెషయా 10:6భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను దోపుడుసొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి కాజ్ఞాపించెదను.
- Luke 24:19 లూకా 24:19ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారునజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయై యుండెను.
- Isaiah 8:9 యెషయా 8:9జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు.
- Deuteronomy 20:1 ద్వితీయోపదేశకాండము 20:1నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱ ములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచు నప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును.
- 2 Samuel 22:43 2 సమూయేలు 22:43నేల ధూళివలె వారిని నలుగగొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంటవలె నేను వారిని పారపోసి అణగద్రొక్కెదను.
- Joel 3:12–17 యోవేలు 3:12–17నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధిక మాయెను, మీరు దిగి రండి. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు. సూర్య చంద్రులు తేజోహీనులైరి; నక్షత్ర ముల కాంతి తప్పిపోయెను. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయ మగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. అన్యు లికమీదట దానిలో సంచరింపకుండ యెరూషలేము పరి శుద్ధపట్టణముగా ఉండును; మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివ సించుచున్నానని మీరు తెలిసికొందురు.
- Matthew 28:20 మత్తయి 28:20నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.