Zephaniah · chapter 3 · verse 1
Zephaniah 3:1 in Telugu
ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ.
Mushkaramainadiyu bhrashtamainadiyu anyaayamu cheyunadiyunagu pattanamunaku shrama.
Zephaniah 3:1 in English
- King James Version (KJV)
- Woe to her that is filthy and polluted, to the oppressing city!
- World English Bible (WEB)
- Woe to her who is rebellious and polluted, the oppressing city!
- American Standard Version (ASV)
- Woe to her that is rebellious and polluted! to the oppressing city!
- Bible in Basic English (BBE)
- Sorrow to her who is uncontrolled and unclean, the cruel town!
- Darby Translation (DBY)
- Woe to her that is rebellious and corrupted, to the oppressing city!
- Webster's Bible (WBS)
- Woe to her that is filthy and polluted, to the oppressing city!
- Young's Literal Translation (YLT)
- Woe [to] the rebellious and polluted, The oppressing city!
Read in context
- 1ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ.
- 2అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాస ముంచదు, దాని దేవునియొద్దకు రాదు.
- 3దాని మధ్య దాని అధిపతులు గర్జనచేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారువరకు ఎరలో ఏమియు మిగులకుండ భక్షించు తోడేళ్లు.
Cross references
- Jeremiah 6:6 యిర్మీయా 6:6సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడిదిబ్బ కట్టుడి, ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడచునది గనుక శిక్ష నొందవలసి వచ్చెను.
- Isaiah 59:13 యెషయా 59:13తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపుమాటలు పలు కుటయు ఇవియే మావలన జరుగుచున్నవి.
- Isaiah 30:12 యెషయా 30:12అందుచేతను ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఈ వాక్యమువద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసికొంటిరి గనుక
- Malachi 3:5 మలాకీ 3:5తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారులమీదను అప్ర మాణికులమీదను, నాకు భయపడక వారి కూలివిషయ ములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయువారిమీదను దృఢ ముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Ezekiel 22:7 యెహెజ్కేలు 22:7నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు,
- Zechariah 7:10 జెకర్యా 7:10విధవరాండ్రను తండ్రిలేనివారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి, మీ హృదయ మందు సహోదరులలో ఎవరికిని కీడు చేయ దలచకుడి.
- Micah 2:2 మీకా 2:2వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించు కొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు.
- Leviticus 1:16 లేవీయకాండము 1:16మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలి పీఠము తూర్పుదిక్కున బూడిదెను వేయుచోట దానిని పారవేయవలెను.
- Isaiah 5:7 యెషయా 5:7ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలా త్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.
- Jeremiah 22:17 యిర్మీయా 22:17అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపదాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు.
- Ezekiel 22:29 యెహెజ్కేలు 22:29మరియు సామాన్య జనులు బలాత్కారముచేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు.
- Amos 4:1 ఆమోసు 4:1షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టువారలారా మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, యీ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా