Daiva Maata Maa Nota Palukutaam Adi Jeevapu Oota Lyrics in Telugu & English
Verse 1
దైవ మాట మా నోట పలుకుతాం అది జీవపు ఊట
దైవ మాట! మా నోట! చెడును కాల్చేడి నిప్పుల ఊట!
రాజాజ్ఞ ఈ మాట - అధికారం గల మాట - ఆయుధము నీ నోట
పెల్లగించేయ్ - ప్రభువు నాటని మొక్కను
విరుగగొట్టేయ్ - సాతాను కాడిని
నశింపజేసేయ్ - అపవాది క్రియలను
పడద్రోసేయ్ - ఆ దుష్టుని ప్రతి దుర్గమును
కట్టరా యిక దేవుని రాజ్యము
నాటరా ప్రతి హృదయంలో వాక్యము
నాటరా ఈ వాక్యంతో సంఘము
Daiva Maata Maa Nota Palukutaam Adi Jeevapu Oota
Daiva Maata! Maa Nota! Chedunu Kaalchedi Nippula Oota!
Raajaajnya Ee Maata - Adhikaaram Gala Maata - Aayudhamu Nee Nota
Pellaginchey - Prabhuvu Naatani Mokkanu
Virugagottey - Saataanu Kaadini
Nashimpajesey - Apavaadi Kriyalanu
Padadrosey - Aa Dushtuni Prati Durgamunu
Kattaraa Yika Devuni Raajyamu
Naataraa Prati Hrudayanlo Vaakyamu
Naataraa Ee Vaakyanto Sanghamu
Verse 2
ప్రపంచములు ఈ మాట వలనే నిర్మాణములైనవి గదా
మహత్తుగల తన మాట చేత నిర్వహించుచున్నాడుగా
సృష్టిని పరిపాలించే దైవం ఈ మాట
సృష్టిని నడిపిస్తున్న శబ్దం ఈ మాట
ఈ మాట నువు పలికి ఏలేయ్ ప్రతిచోట
Prapanchamulu Ee Maata Valane Nirmaanamulainavi Gadaa
Mahattugala Tana Maata Cheta Nirvahinchuchunnaadugaa
Srushtini Paripaalinche Daivam Ee Maata
Srushtini Nadipistunna Shabdam Ee Maata
Ee Maata Nuvu Paliki Eley Pratichota
Verse 3
ప్రవక్తలంతా ఈ మాట పలికి రాజ్యాల్నే కదిలించెగా
తన సేవకుల మాటల్ని ప్రభువు తప్పక రూఢిపరచుగా
ఆత్మ చెప్పే మాట పలుకు నీ నోట
ఉరుమై గర్జించాలి సత్యం ప్రతిచోట
ఈ మాట నిష్ఫలము కాదు ఏ పూట
Pravaktalantaa Ee Maata Paliki Raajyaalne Kadilinchegaa
Tana Sevakula Maatalni Prabhuvu Tappaka Roodhiparachugaa
Aatma Cheppe Maata Paluku Nee Nota
Urumai Garjinchaali Satyam Pratichota
Ee Maata Nishphalamu Kaadu E Poota
Verse 4
ప్రభువైన యేసు తన మాట వలన దయ్యాలను వదిలించెగా
తన వాక్కు పంపి, ఏ వ్యాధినైనా క్షణమందు బాగుచేసెగా
గాలి తుఫాన్నైనా ఆపును ఈ మాట
ఎండిన ఎముకలనైనా లేపును ఈ మాట
ఈ మాటతో కూల్చేయ్ రా ఆ దుష్టుని కోట
Prabhuvaina Yesu Tana Maata Valana Dayyaalanu Vadilinchegaa
Tana Vaakku Pampi, E Vyaadhinainaa Kshanamandu Baaguchesegaa
Gaali Tuphaannainaa Aapunu Ee Maata
Endina Emukalanainaa Lepunu Ee Maata
Ee Maatato Koolchey Raa Aa Dushtuni Kota
Verse 5
ప్రతి రోజు నువ్వు శోధనలన్నిటిని గెలవొచ్చు ఈ వాక్కుతో
ఆత్మయుద్ధంలో దుష్టుని ఎదిరించి తరుమొచ్చు ఈ కత్తితో
దుష్టుని నేలకు కూల్చే ఖడ్గం ఈ మాట
చీకటి శక్తులపైన విజయం ఈ మాట
ఈ మాట అపవాది గుండెల్లో తూట
Prati Roju Nuvvu Shodhanalannitini Gelavochchu Ee Vaakkuto
Aatmayuddhanlo Dushtuni Edirinchi Tarumochchu Ee Kattito
Dushtuni Nelaku Koolche Khadgam Ee Maata
Cheekati Shaktulapaina Vijayam Ee Maata
Ee Maata Apavaadi Gundello Toota
Verse 6
ప్రకటించేయ్ వాక్యం బందీలందరికి స్వాతంత్ర్యమునిచ్చే సత్యం
హృదయపు లోతులను సరిచేసే శస్త్రం ఇది రెండంచుల గల ఖడ్గం
బండను బద్దలు చేసే సుత్తె ఈ మాట
చెత్తను దగ్ధం చేసే అగ్ని ఈ మాట
ఈ మాట దీపంలా చూపించును బాట
Prakatinchey Vaakyam Bandeelandariki Svaatantryamunichche Satyam
Hrudayapu Lotulanu Sarichese Shastram Idi Rendanchula Gala Khadgam
Bandanu Baddalu Chese Sutte Ee Maata
Chettanu Dagdham Chese Agni Ee Maata
Ee Maata Deepanlaa Choopinchunu Baata
Verse 7
ప్రవచనమగు వాక్యం నువు పలుకుతూ ఉంటే అద్భుతాల్ని చూస్తావుగా
వాక్యం నెరవేర్చే బలశూరులైన దూతల్ని పొందొచ్చుగా
వాక్యం నీకు వస్తే దైవం నువ్వంట
వాక్యం నీలో ఉంటే (నువ్వు తింటే) బలవంతుడవంట
ఈ మాట మండించును హృదయాల్లో మంట
Pravachanamagu Vaakyam Nuvu Palukutoo Unte Adbhutaalni Choostaavugaa
Vaakyam Neraverche Balashoorulaina Dootalni Pondochchugaa
Vaakyam Neeku Vaste Daivam Nuvvanta
Vaakyam Neelo Unte (Nuvvu Tinte) Balavantudavanta
Ee Maata Mandinchunu Hrudayaallo Manta
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.