Skip to content
ThuthiThuthiThuthi

Daivakrupa Naapai Adhikamugaa Song Lyricsదైవకృప నాపై అధికముగా

Daivakrupa Naapai Adhikamugaa Lyrics in Telugu & English

Present

Verse 1

దైవకృప నాపై అధికముగా

నిలిపి నన్ను నడిపించినావు

పరిశుద్ధుల శేషములో నన్ను నిలిపినావు

మ్రొక్కను ఎవ్వరికి నీవే నా దైవం

కఠినమైన పరిస్థితులు తొలగించగలవు

లేదేది నీకు అసాధ్యము యేసయ్య (2)

// దైవకృప //

Daivakrupa Naapai Adhikamugaa

Nilipi Nannu Nadipinchinaavu

Parishuddhula Sheshamulo Nannu Nilipinaavu

Mrokkanu Evvariki Neeve Naa Daivam

Kathinamaina Paristhitulu Tolaginchagalavu

Lededi Neeku Asaadhyamu Yesayya (2)

// Daivakrupa //

Verse 2

ఎవ్వరిని నీవు కరుణింతువో

ఎవ్వరియందు జాలిపడుదువో

ఎవ్వరిని నీవు ప్రేమింతువో

ఎవ్వరియందు నీ కృప నిలుచునో (2)

మహిమైశ్వర్యము కనపరచుచు

ఆశీర్వాదము కుమ్మరింతువు (2)

ఆశీర్వాదమే నా జీవితములో

స్వాస్థ్య మహిమను నాకిచ్చెను (2)

// దైవకృప //

Evvarini Neevu Karunintuvo

Evvariyandu Jaalipaduduvo

Evvarini Neevu Premintuvo

Evvariyandu Nee Krupa Niluchuno (2)

Mahimaishvaryamu Kanaparachuchu

Aasheervaadamu Kummarintuvu (2)

Aasheervaadame Naa Jeevitamulo

Svaasthya Mahimanu Naakichchenu (2)

// Daivakrupa //

Verse 3

పరిశుద్ధునిగా ఉండుటకై

నీ సంకల్పములో పిలచితివి

నీ రూపములో జీవించుటే

నీ నిర్ణయమై వరమాయెను (2)

విశ్వమంతా జయించెదను విధేయుడనై

విశ్వాసముతో పోరాడెదా (2)

విశ్వాసముతో నా జీవితములో

నీతి కిరీటము నే పొందెదా (2)

// దైవకృప //

Parishuddhunigaa Undutakai

Nee Sankalpamulo Pilachitivi

Nee Roopamulo Jeevinchute

Nee Nirnayamai Varamaayenu (2)

Vishvamantaa Jayinchedanu Vidheyudanai

Vishvaasamuto Poraadedaa (2)

Vishvaasamuto Naa Jeevitamulo

Neeti Kireetamu Ne Pondedaa (2)

// Daivakrupa //

Verse 4

వెదకనివారికి దొరికితివి

అభయము నీవై ఆదుకొంటివి

విచారించని ప్రతివానికి

నీ ప్రత్యక్షత నొసగితివి (2)

నీ రాజ్యముకై సిద్ధపరచుచు

ప్రతిష్ఠిత జనముగా స్థాపించియుంటివి (2)

ప్రతిష్ఠితుడనై నా జీవితములో

సీయోను ప్రతిష్ఠను ప్రజ్వలింపజేసెదా (2)

// దైవకృప //

Vedakanivaariki Dorikitivi

Abhayamu Neevai Aadukontivi

Vichaarinchani Prativaaniki

Nee Pratyakshata Nosagitivi (2)

Nee Raajyamukai Siddhaparachuchu

Pratishthita Janamugaa Sthaapinchiyuntivi (2)

Pratishthitudanai Naa Jeevitamulo

Seeyonu Pratishthanu Prajvalimpajesedaa (2)

// Daivakrupa //

Verse 5

విరిగిపోయిన నా జీవితమును

నూతన సృష్టిగా చేసితివే

అంటుకట్టితివి సమర్థుడవై

శత్రువు యుక్తులను కూల్చితివే (2)

సంహరించెదవు నోటి ఊపిరితో

లయము చేసెదవు శత్రువులను (2)

నెమ్మదికలిగి నా జీవితములో

నెరవేర్చెదను నీ చిత్తమంతయు (2)

// దైవకృప //

Virigipoyina Naa Jeevitamunu

Nootana Srushtigaa Chesitive

Antukattitivi Samarthudavai

Shatruvu Yuktulanu Koolchitive (2)

Sanharinchedavu Noti Oopirito

Layamu Chesedavu Shatruvulanu (2)

Nemmadikaligi Naa Jeevitamulo

Neraverchedanu Nee Chittamantayu (2)

// Daivakrupa //

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D