Skip to content
ThuthiThuthiThuthi

Devuni Goppa Mahimanu Choosi Tirigi Paapam Chesedavaa? Song Lyricsదేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?

Also searched as: devuni

Devuni Goppa Mahimanu Choosi Tirigi Paapam Chesedavaa? Lyrics in Telugu & English

Present

Verse 1

దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?

ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా! (2)

ఎంత అధము అన్యుల కన్న, ఎంత ఘోరము ఆ యూద కన్న

వలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో మన్నా (2)

మరచినవా నీ అపజయములు

గుర్తు లేదా! ఆ శోధనలు

నీవు చూపిన ఆ వినయములు

ఏడ్చి చేసిన ఆ ప్రార్థనలు

తండ్రి నీవే దిక్కంటూ, మోకరిల్లిన ఆ క్షణము

అందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు (2)

||ఎంత||

Devuni Goppa Mahimanu Choosi Tirigi Paapam Chesedavaa?

Dvanda Neetiki Nishkruti Ledani Neeku Telusaa O Kraistavaa! (2)

Enta Adhamu Anyula Kanna, Enta Ghoramu Aa Yooda Kanna

Valadu Paapam Ikapainanna, Tirigi Pondu Kreestulo Mannaa (2)

Marachinavaa Nee Apajayamulu

Gurtu Ledaa! Aa Shodhanalu

Neevu Choopina Aa Vinayamulu

Edchi Chesina Aa Praarthanalu

Tandri Neeve Dikkantoo, Mokarillina Aa Kshanamu

Andukontivi Vijayamulu, Vidichi Peditivi Vaakyamulu (2)

||Enta||

Verse 2

అందుకొంటివి బాప్తిస్మమును

పొందు కొంటివి ఆ రక్షణను

వదలబోకు ఆత్మీయతను

చేరనివ్వకు నిర్లక్ష్యమును

తీర్పు తీర్చే సమయంలో ఓర్పు దొరకదు గుర్తెరుగు

నిత్య జీవం లో నుండి, ఘోర నరకం చేరెదవా? (2)

||ఎంత||

Andukontivi Baaptismamunu

Pondu Kontivi Aa Rakshananu

Vadalaboku Aatmeeyatanu

Cheranivvaku Nirlakshyamunu

Teerpu Teerche Samayanlo Orpu Dorakadu Gurterugu

Nitya Jeevam Lo Nundi, Ghora Narakam Cheredavaa? (2)

||Enta||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D