Skip to content
ThuthiThuthiThuthi

Dorakutaavuraa Sahodaraa! Dorukutaavuraa Song Lyricsదొరకుతావురా సహోదరా! దొరుకుతావురా

Dorakutaavuraa Sahodaraa! Dorukutaavuraa Lyrics in Telugu & English

Present

Chorus

దొరకుతావురా సహోదరా! దొరుకుతావురా, నీవు

తరిమి తరిమి కీడుచేయ పరుగులెత్తినగాని తుదకు

||దొరకుతావురా||

Dorakutaavuraa Sahodaraa! Dorukutaavuraa, Neevu

Tarimi Tarimi Keeducheya Parugulettinagaani Tudaku

||Dorakutaavuraa||

Verse 1

చిన్న చూపు చూచి తమ్ముని కన్నెఱుంగక చంపినగాని

అన్న కయీను దేవుని హస్తమునకు దొరికిన రీతిగా

||దొరకుతావురా||

Chinna Choopu Choochi Tammuni Kannerungaka Champinagaani

Anna Kayeenu Devuni Hastamunaku Dorikina Reetigaa

||Dorakutaavuraa||

Verse 2

వరములొందిన తమ్ముని జంప వలయునని పంతముగబట్టి

నరకవచ్చిలోబడి యేడ్చిన దురిత చరితుని యేశావువలె

||దొరకుతావురా||

Varamulondina Tammuni Jampa Valayunani Pantamugabatti

Narakavachchilobadi Yedchina Durita Charituni Yeshaavuvale

||Dorakutaavuraa||

Verse 3

భక్త దావీదును బట్టి ప్రాణము దీయగ దలచిన తన

శక్తితో తరిమిన రాజగు సౌలు దొరికినరీతిగాను

||దొరకుతావురా||

Bhakta Daaveedunu Batti Praanamu Deeyaga Dalachina Tana

Shaktito Tarimina Raajagu Saulu Dorikinareetigaanu

||Dorakutaavuraa||

Verse 4

విగ్రహమునకు మ్రొక్కని దైవ పిల్లల నగ్నిలోపడవైచి

ఆగ్రహించిన నెబుకద్నెజరు గడ్డిమోసి దొరికిన విధముగ

||దొరకుతావురా||

Vigrahamunaku Mrokkani Daiva Pillala Nagnilopadavaichi

Aagrahinchina Nebukadnejaru Gaddimosi Dorikina Vidhamuga

||Dorakutaavuraa||

Verse 5

క్రైస్తవులను బట్టి కొట్టి ఖైదులో వేయదలచినను

వాస్తవమగు వెలుగును జూచి ప్రభుని చాటిని పౌలుబోలి

||దొరకుతావురా||

Kraistavulanu Batti Kotti Khaidulo Veyadalachinanu

Vaastavamagu Velugunu Joochi Prabhuni Chaatini Pauluboli

||Dorakutaavuraa||

Verse 6

కీడుచేయబోకు మెపుడు కీడు నీకే కీడు కీడు

కీడు చేసినమేలుచేసి కీడును జయింపకపోతే

||దొరకుతావురా||

Keeducheyaboku Mepudu Keedu Neeke Keedu Keedu

Keedu Chesinameluchesi Keedunu Jayimpakapote

||Dorakutaavuraa||

Verse 7

మాటలు కుదిరితే మాటలు కోటలు కుదురును నీకు

మాటలలో లోటుంటే నోటిమాట తప్పకుండ

||దొరకుతావురా||

Maatalu Kudirite Maatalu Kotalu Kudurunu Neeku

Maatalalo Lotunte Notimaata Tappakunda

||Dorakutaavuraa||

Verse 8

దొంగతనము వ్యభిచారమునకు లొంగి శాపగ్రస్తులునై

దొంగిలించిన దశమభాగమే లొంగుట కారణమని తుదకు

||దొరకుతావురా||

Dongatanamu Vyabhichaaramunaku Longi Shaapagrastulunai

Dongilinchina Dashamabhaagame Longuta Kaaranamani Tudaku

||Dorakutaavuraa||

Verse 9

కొంతయిచ్చిన దశభాగ మంత యిదియని తప్పుకున్న

కొంతయిచ్చిన కయీనువలె కొంతయిచ్చిన అననియవలె

||దొరకుతావురా||

Kontayichchina Dashabhaaga Manta Yidiyani Tappukunna

Kontayichchina Kayeenuvale Kontayichchina Ananiyavale

||Dorakutaavuraa||

Verse 10

చెడుగుచేసి బదులు దానిని చేసినారని చెప్పమన్న వడిగ

దేవుని న్యాయమనెడి పరమత్రాసులో నిలువండి

||దొరకుతావురా||

Cheduguchesi Badulu Daanini Chesinaarani Cheppamanna Vadiga

Devuni Nyaayamanedi Paramatraasulo Niluvandi

||Dorakutaavuraa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D