Skip to content
ThuthiThuthiThuthi

Ellappudunu Prabhuvunandu Aanandinchandi Song Lyricsఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి

Ellappudunu Prabhuvunandu Aanandinchandi Lyrics in Telugu & English

Present

Chorus

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి

ప్రతి సమయములోను…

ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2)

యెహోవా చేసిన మేలుల కొరకై

ఎల్లప్పుడును ఆనందించండి (2)

ఆరాధించండి

||ఎల్లప్పుడును||

Ellappudunu Prabhuvunandu Aanandinchandi

Prati Samayamulonu…

Prati Paristhitilonu Aanandinchandi (2)

Yehovaa Chesina Melula Korakai

Ellappudunu Aanandinchandi (2)

Aaraadhinchandi

||Ellappudunu||

Verse 1

పాపంబు తోడ చింతించుచుండ

నరునిగా ఈ భువిలో ఉదయించెగా

మన పాప భారం తన భుజమున మోసి

మనకై తన ప్రాణం అర్పించెగా (2)

ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసి

ఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే

||ఎల్లప్పుడును||

Paapambu Toda Chintinchuchunda

Narunigaa Ee Bhuvilo Udayinchegaa

Mana Paapa Bhaaram Tana Bhujamuna Mosi

Manakai Tana Praanam Arpinchegaa (2)

Uchitaardhamaina Rakshananu Nosagi Neetimantuni Chesi

Ullaasa Vastramunu Dhariyimpajesi Yunnaadu Ganuke

||Ellappudunu||

Verse 2

విశ్వాసమునకు కలిగే పరీక్ష

ఓర్పును కలిగించే ఒక సాధనమై

శోధనకు నిలిచి సహించిన వేళ

జీవ కిరీటమును పొందెదము (2)

నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండి

సంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి

||ఎల్లప్పుడును||

Vishvaasamunaku Kalige Pareeksha

Orpunu Kaliginche Oka Saadhanamai

Shodhanaku Nilichi Sahinchina Vela

Jeeva Kireetamunu Pondedamu (2)

Naanaa Vidhaalaina Shodhanalo Padinappudu Aanandinchandi

Sampoornulugaanu Koduve Leni Orpunu Konasaaginchandi

||Ellappudunu||

Verse 3

ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి

మరణము దుఃఖము ఏడ్పును దూరము చేసి

మనతో నివాసమును కలిగి యుండుటకు

త్వరలోనే రారాజుగా రానైయుండె (2)

శుభప్రదమైన నిరీక్షణతో కాచియుండండి

సిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి

||ఎల్లప్పుడును||

Prati Baashpa Binduvunu Tudichi Vesi

Maranamu Duhkhamu Edpunu Dooramu Chesi

Manato Nivaasamunu Kaligi Yundutaku

Tvaralone Raaraajugaa Raanaiyunde (2)

Shubhapradamaina Nireekshanato Kaachiyundandi

Siddhamaina Manassunu Kaligi Vechiyundandi

||Ellappudunu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E