Emunnadi Naalo O Yesayya Lyrics in Telugu & English
Verse 1
ఏమున్నది నాలో ఓ యేసయ్య
మచ్చుకైన మంచి కానరాదయ్యా (2)
ఎంతవెదకి చూచినా పాపమే గదయ్యా (2)
ఎందుకయ్య నాపై నీకింత ప్రేమయ్యా
Emunnadi Naalo O Yesayya
Machchukaina Manchi Kaanaraadayyaa (2)
Entavedaki Choochinaa Paapame Gadayyaa (2)
Endukayya Naapai Neekinta Premayyaa
Verse 2
యేసయ్యా… నా దైవమా
యేసయ్యా… నిత్యజీవ మార్గమా
యేసయ్యా… నా దైవమా
యేసయ్యా… పరలోక ద్వారమా // ఏమున్నది //
Yesayyaa… Naa Daivamaa
Yesayyaa… Nityajeeva Maargamaa
Yesayyaa… Naa Daivamaa
Yesayyaa… Paraloka Dvaaramaa // Emunnadi //
Verse 3
నినుచూడ సాధ్యమేనా తేజోమయ
కరుణించి ననుచేరే నీదయ
వెలువడగా నీవాక్యం కనబడె నాపాపం
తడబడిన నా పాదం స్థిరపడె నీకోసం
క్షమియించి ఇచ్చావయ్యా నీకృపాక్షేమము –
నన్నావరించెనయ్యా నీదువాత్సల్యము (2)
తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును
// యేసయ్యా… //
Ninuchooda Saadhyamenaa Tejomaya
Karuninchi Nanuchere Needaya
Veluvadagaa Neevaakyam Kanabade Naapaapam
Tadabadina Naa Paadam Sthirapade Neekosam
Kshamiyinchi Ichchaavayyaa Neekrupaakshemamu –
Nannaavarinchenayyaa Needuvaatsalyamu (2)
Taniviteeraa Anukshanam Ninnaaraadhintunu
// Yesayyaa… //
Verse 4
నీపైనే తిరుగుబాటు చేసానయ్యా
తాలిమితో మన్నించే నీ దయ
శ్రమపడగా నీదేహం సరియాయెను సర్వం
కార్చితివి నీరుధిరం దొరికెను పరిహారం
నే తీర్చజాలనయ్యా నీ ఋణమే మాత్రము –
సాక్షిగా నిలుతునయ్యా నా జీవితాంతము (2)
తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును
// యేసయ్యా… //
Neepaine Tirugubaatu Chesaanayyaa
Taalimito Manninche Nee Daya
Shramapadagaa Needeham Sariyaayenu Sarvam
Kaarchitivi Neerudhiram Dorikenu Parihaaram
Ne Teerchajaalanayyaa Nee Runame Maatramu –
Saakshigaa Nilutunayyaa Naa Jeevitaantamu (2)
Taniviteeraa Anukshanam Ninnaaraadhintunu
// Yesayyaa… //
Verse 5
నిను వీడి పారిపోతి ప్రేమామయ
విడువకయే నను వెదకే నీ దయ
వినబడగా నీ స్వరం పులకించెను దేహం
తెంచితివి బంధకం కలిగెను స్వాతంత్ర్యం
క్షణమైన విడువనయ్యా నీ సన్నిధానము –
వివరింప జాలనయ్యా ఈ గొప్ప భాగ్యము (2)
తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును
// యేసయ్యా… //
Ninu Veedi Paaripoti Premaamaya
Viduvakaye Nanu Vedake Nee Daya
Vinabadagaa Nee Svaram Pulakinchenu Deham
Tenchitivi Bandhakam Kaligenu Svaatantryam
Kshanamaina Viduvanayyaa Nee Sannidhaanamu –
Vivarimpa Jaalanayyaa Ee Goppa Bhaagyamu (2)
Taniviteeraa Anukshanam Ninnaaraadhintunu
// Yesayyaa… //
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.