Immuga Nee Sudinambu Nundi Lyrics in Telugu & English
Verse 1
ఇమ్ముగ నీ సుదినంబు నుండి
మిమ్ము నాశీర్వాదించెదను
పొమ్మనిన ఓ మా ప్రభువా
Immuga Nee Sudinambu Nundi
Mimmu Naasheervaadinchedanu
Pommanina O Maa Prabhuvaa
Verse 2
మునుపటి మందిర మహిమను మించు
కడపటి మందిర మహిమ
ఈ స్థలమందు నా సమాధానం
ఎంతైన నిచ్చెద నంటివి ప్రభువా
Munupati Mandira Mahimanu Minchu
Kadapati Mandira Mahima
Ee Sthalamandu Naa Samaadhaanam
Entaina Nichcheda Nantivi Prabhuvaa
Verse 3
అన్యజనులను కదిలింపగానే
అన్ని వస్తువులు తేబడును
వెండి బంగారము అన్నియు నావే
దండిగ నిచ్చెద నంటివి ప్రభువా
Anyajanulanu Kadilimpagaane
Anni Vastuvulu Tebadunu
Vendi Bangaaramu Anniyu Naave
Dandiga Nichcheda Nantivi Prabhuvaa
Verse 4
ఇంపుగ తొమ్మిదవ మాసమున
ఇరువది నాల్గవ దినము
నీ మందిర ఆస్థి భారమును
నీ వాజ్ఞాపించి వేయించితివి
Impuga Tommidava Maasamuna
Iruvadi Naalgava Dinamu
Nee Mandira Aasthi Bhaaramunu
Nee Vaajnyaapinchi Veyinchitivi
Verse 5
నీ ఆజ్ఞలను శిరసావహించి
దివ్యంబుగ నాబ్రాహాము
హెబ్రోనులో గుడారంబు వేసి
కట్టెను బలిపీఠము నా చోట
Nee Aajnyalanu Shirasaavahinchi
Divyambuga Naabraahaamu
Hebronulo Gudaarambu Vesi
Kattenu Balipeethamu Naa Chota
Verse 6
నిండు మనస్సుతో కాలేబు నిన్ను
దండిగ ననుసరించగ
హెబ్రోనును తన స్వాస్థ్యంబుగను
సంభ్రముగ నొసంగిన దాత
Nindu Manassuto Kaalebu Ninnu
Dandiga Nanusarinchaga
Hebronunu Tana Svaasthyambuganu
Sambhramuga Nosangina Daata
Verse 7
దావీదు రాజు నీ సన్నిధిలో
దీనతతో మనవి చేయ
హెబ్రోను పొమ్మని సెలవిచ్చితివి
ప్రభో కలుగు నీకు నీకు నిత్య మహిమ
Daaveedu Raaju Nee Sannidhilo
Deenatato Manavi Cheya
Hebronu Pommani Selavichchitivi
Prabho Kalugu Neeku Neeku Nitya Mahima
Verse 8
ఎల్లల నెల్ల విశాల పరచి
కొల్లగ ప్రేమను జూపి
ఎల్ల శక్తిని జూపిన ప్రభో
హల్లెలూయ నీకే యేసు ప్రభో
Ellala Nella Vishaala Parachi
Kollaga Premanu Joopi
Ella Shaktini Joopina Prabho
Hallelooya Neeke Yesu Prabho
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.