Jeevapudaata Naa Hrudayamuloniki Raa Lyrics in Telugu & English
Verse 1
జీవపుదాత నా హృదయములోనికి రా
నూతన వెలుగు నూతన యనుభవ మందరికి నిమ్ము
Jeevapudaata Naa Hrudayamuloniki Raa
Nootana Velugu Nootana Yanubhava Mandariki Nimmu
Verse 2
నూతన జన్మమును మా కొసగి – నూతనముగ మము చేయన్
నూతన ఆత్మ హృదయము నిమ్ము – నిను నే స్తుతియింపన్
Nootana Janmamunu Maa Kosagi – Nootanamuga Mamu Cheyan
Nootana Aatma Hrudayamu Nimmu – Ninu Ne Stutiyimpan
Verse 3
నూతన వ్యక్తిగచేయుము ప్రభువా – లోకము చూచునట్లు
నూతన వస్త్రాహారము లిచ్చి – సుందరునిగ చేయుము
Nootana Vyaktigacheyumu Prabhuvaa – Lokamu Choochunatlu
Nootana Vastraahaaramu Lichchi – Sundaruniga Cheyumu
Verse 4
నూతన వాక్కులను మాకొసగి – నూతన గీతము నేర్పు
Nootana Vaakkulanu Maakosagi – Nootana Geetamu Nerpu
Verse 5
నూతన రాగమును మా కొసగి – నిత్యము స్తుతి పొందుము
Nootana Raagamunu Maa Kosagi – Nityamu Stuti Pondumu
Verse 6
నూతన శక్తిని అందరికొసగి – నూతన మార్గము జూపు
నీదు మహిమ కొరకై నాకు – నూతన నడకను నేర్పు
Nootana Shaktini Andarikosagi – Nootana Maargamu Joopu
Needu Mahima Korakai Naaku – Nootana Nadakanu Nerpu
Verse 7
నూతన పాత్రగను ననుజేసి – నీదు మహిమతో నింపు
నూతన ఆయుధముగ మముజేసి – శత్రువును ఓడించు
Nootana Paatraganu Nanujesi – Needu Mahimato Nimpu
Nootana Aayudhamuga Mamujesi – Shatruvunu Odinchu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.