Kaalamu Svalpakaalamu Kadipi Choodu Adi Kathinamainadi Lyrics in Telugu & English
Verse 1
కాలము స్వల్పకాలము
కదిపి చూడు అది కఠినమైనది
సమయము సర్వకాయమూ
తడిమి చూడు అది కరకుగుంటది
ఎదురుగున్నాదెవ్వరైనా
తలను ఎన్నడూ వంచనంటది
ఎప్పుడైనా ఎక్కడైనా తిరిగి చూడని పయనమే తనది
Kaalamu Svalpakaalamu
Kadipi Choodu Adi Kathinamainadi
Samayamu Sarvakaayamoo
Tadimi Choodu Adi Karakuguntadi
Edurugunnaadevvarainaa
Talanu Ennadoo Vanchanantadi
Eppudainaa Ekkadainaa Tirigi Choodani Payaname Tanadi
Verse 2
కాలమన్న వాహనం ఆగనన్నది
వెనక తిరిగి చూసేదే లేదనన్నది
బ్రతిమిలాడదామన్నా కుదరదంటది
ఎటులనైన తనతోనే కదలమంటది
మాట వినదు కాసేపైనా చెవులు మూసుకుంటుంది
స్థితిని కనదు ఏదేమైనా చితికి కూడా చలియించదది
మొండిదా గుండె లేనిదా
కంటనీరు చూసినా కరగనంటదది
Kaalamanna Vaahanam Aaganannadi
Venaka Tirigi Choosede Ledanannadi
Bratimilaadadaamannaa Kudaradantadi
Etulanaina Tanatone Kadalamantadi
Maata Vinadu Kaasepainaa Chevulu Moosukuntundi
Sthitini Kanadu Edemainaa Chitiki Koodaa Chaliyinchadadi
Mondidaa Gunde Lenidaa
Kantaneeru Choosinaa Karaganantadadi
Verse 3
సృష్టికర్త చేతులలో వాడబడతది
ఇవ్వబడిన పనులన్నీ చక్కబెడతది
తనకు ఉన్న నియమాల్నే మీరనంటది
ఘనతనొందు దేవునికే లోబడుంటది
మనము మేలుకొని జీవిస్తే అమృతాన్ని అంటుంది
గాఢనిద్రలో మునిగుంటే గరళమల్లె కాటేస్తుందది
నరకమా నిత్యజీవమా సత్యవాక్కుతో భువిని హెచ్చరిస్తుంది
Srushtikarta Chetulalo Vaadabadatadi
Ivvabadina Panulannee Chakkabedatadi
Tanaku Unna Niyamaalne Meeranantadi
Ghanatanondu Devunike Lobaduntadi
Manamu Melukoni Jeeviste Amrutaanni Antundi
Gaadhanidralo Munigunte Garalamalle Kaatestundadi
Narakamaa Nityajeevamaa Satyavaakkuto Bhuvini Hechcharistundi
Verse 4
ముప్పది మూడున్నర యేళ్ళే ప్రభువుకున్నది
భువిని మార్చే పనిభారం ఎదుటనున్నది
ప్రభుని బ్రతుకు చూసాకా సమయమనేది
తనను మనకు మాదిరిగా చూపుతున్నది
క్రీస్తు ప్రభువులా పనిచేసి పరము చేరమంటుంది
ఆశ ఉంటె సరిపోదంటూ ఆచరించమని చెబుతుంది
జ్ఞానిలా అన్నివేళలా
ఆత్మపూర్ణులై వెలుగు పంచమంటుంది
Muppadi Moodunnara Yelle Prabhuvukunnadi
Bhuvini Maarche Panibhaaram Edutanunnadi
Prabhuni Bratuku Choosaakaa Samayamanedi
Tananu Manaku Maadirigaa Chooputunnadi
Kreestu Prabhuvulaa Panichesi Paramu Cheramantundi
Aasha Unte Saripodantoo Aacharinchamani Chebutundi
Jnyaanilaa Annivelalaa
Aatmapoornulai Velugu Panchamantundi
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.