Skip to content
ThuthiThuthiThuthi

Kaluvarilo Nee Shiluva Tyaagame Kariginchenu Naa Paapa Song Lyricsకలువరిలో నీ శిలువ త్యాగమే కరిగించెను నా పాప

Kaluvarilo Nee Shiluva Tyaagame Kariginchenu Naa Paapa Lyrics in Telugu & English

Present

Verse 1

కలువరిలో నీ శిలువ త్యాగమే

కలువరిలో నీ శిలువ త్యాగమే

కరిగించెను నా పాప హృదయమే (2)

నీవు కార్చిన ఈ రుధిర ధారలే (2)

కలిగించెను పాపికి పరిహారమే (2)

ఓ మానవా ఇది మన కోసమే

ఈ గొప్ప ప్రేమ బలియాగము (2)

Kaluvarilo Nee Shiluva Tyaagame

Kaluvarilo Nee Shiluva Tyaagame

Kariginchenu Naa Paapa Hrudayame (2)

Neevu Kaarchina Ee Rudhira Dhaarale (2)

Kaliginchenu Paapiki Parihaarame (2)

O Maanavaa Idi Mana Kosame

Ee Goppa Prema Baliyaagamu (2)

Verse 2

మన దోషము కొరకై నలుగగొట్టబడెను

మన అతిక్రమ బాధలు శిలువపై మోసెను (2)

కొరడా దెబ్బలతో గాయపరచబడెను (2)

ఆ గాయములె నిన్ను స్వస్థత పరచెను (2)

||ఓ మానవా ఇది మన కోసమే||

Mana Doshamu Korakai Nalugagottabadenu

Mana Atikrama Baadhalu Shiluvapai Mosenu (2)

Koradaa Debbalato Gaayaparachabadenu (2)

Aa Gaayamule Ninnu Svasthata Parachenu (2)

||O Maanavaa Idi Mana Kosame||

Verse 3

తలపైన ముళ్ళ ప్రక్కలో బల్లెము

చేతులలో మేకులు భరియించినావే (2)

వధకుతేబడిన గొర్రెపిల్లఓలే (2)

మౌనముగా శిక్షను సహియించినావే (2)

||ఓ మానవా ఇది మన కోసమే||

Talapaina Mulla Prakkalo Ballemu

Chetulalo Mekulu Bhariyinchinaave (2)

Vadhakutebadina Gorrepillaole (2)

Maunamugaa Shikshanu Sahiyinchinaave (2)

||O Maanavaa Idi Mana Kosame||

Verse 4

ప్రతి పాపము కడుగును యేసుని రక్తమే

ప్రతి శాపము బాపును ఆ ప్రియుని రక్తమే (2)

నీకై మరణించి విమోచనను కలిగించిన (2)

ఆ ప్రియుని చెంతకు నీవు చేరుమా (2)

||ఓ మానవా ఇది మన కోసమే||

Prati Paapamu Kadugunu Yesuni Raktame

Prati Shaapamu Baapunu Aa Priyuni Raktame (2)

Neekai Maraninchi Vimochananu Kaliginchina (2)

Aa Priyuni Chentaku Neevu Cherumaa (2)

||O Maanavaa Idi Mana Kosame||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K