Skip to content
ThuthiThuthiThuthi

Konta Yedamu Neevainaa Ne Saagalenu Song Lyricsకొంత యెడము నీవైనా నే సాగలేను

Konta Yedamu Neevainaa Ne Saagalenu Lyrics in Telugu & English

Present

Chorus

కొంత యెడము నీవైనా నే సాగలేను

నిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేను

కొంత యెడము నీవైనా

మరచిన వేళలో మది నీ పలుకులు

సడలి కట్టడలు మలినము తలపులు (2)

ప్రేమను పంచే ప్రేమ రూపుడా (2)

మరియొక్క మారు మన్నించు విభుడా (2)

||కొంత యెడము||

Konta Yedamu Neevainaa Ne Saagalenu

Nimishamaina Ninnu Vidichi Ne Bratukalenu

Konta Yedamu Neevainaa

Marachina Velalo Madi Nee Palukulu

Sadali Kattadalu Malinamu Talapulu (2)

Premanu Panche Prema Roopudaa (2)

Mariyokka Maaru Manninchu Vibhudaa (2)

||Konta Yedamu||

Verse 1

కనులకు మోహము కమ్మిన క్షణము

వినుట మరచె నీ స్వరమును హృదయము (2)

కమ్మిన పొరలు కరిగించుటకు (2)

నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు (2)

||కొంత యెడము||

Kanulaku Mohamu Kammina Kshanamu

Vinuta Marache Nee Svaramunu Hrudayamu (2)

Kammina Poralu Kariginchutaku (2)

Nadupu Nee Vaipuku Hrudi Velugutaku (2)

||Konta Yedamu||

Verse 2

మదము, మత్సరములు సోకిన తరుణము

పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము (2)

నిరతము స్థిరముగ నున్న అక్షయుడా (2)

నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా (2)

||కొంత యెడము||

Madamu, Matsaramulu Sokina Tarunamu

Paashamu, Premaku Vigatamu Praaptamu (2)

Niratamu Sthiramuga Nunna Akshayudaa (2)

Nilupumu Nee Krupalo Nannu Rakshakudaa (2)

||Konta Yedamu||

Verse 3

మనుజ రూపమున మహిలో నిలిచి

మనిషికసాధ్యమౌ మరణము గెలిచి (2)

నను వరియించగ రానున్న ప్రియుడా (2)

నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా (2)

||కొంత యెడము||

Manuja Roopamuna Mahilo Nilichi

Manishikasaadhyamau Maranamu Gelichi (2)

Nanu Variyinchaga Raanunna Priyudaa (2)

Ninnedurukonaga Mati Niyyu Varudaa (2)

||Konta Yedamu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K