Manasa Yesu Marana Baadha Lenasi Paadave Lyrics in Telugu & English
Chorus
మనస యేసు మరణ బాధ – లెనసి పడవే
తన – నెనరు జూడవే యా – ఘనుని గూడవే
నిను – మనుప జచ్చుటరసియే – మరక వేడవే
||మనస||
Manasa Yesu Marana Baadha – Lenasi Padave
Tana – Nenaru Joodave Yaa – Ghanuni Goodave
Ninu – Manupa Jachchutarasiye – Maraka Vedave
||Manasa||
Verse 1
అచ్చి పాపములను బాప – వచ్చినాడట
వాక్కిచ్చి తండ్రితో నా – గెత్సేమందున
తా – జొచ్చి యెదను నొచ్చి బాధ – హెచ్చుగనెనట
||మనస||
Achchi Paapamulanu Baapa – Vachchinaadata
Vaakkichchi Tandrito Naa – Getsemanduna
Taa – Jochchi Yedanu Nochchi Baadha – Hechchuganenata
||Manasa||
Verse 2
ఆ నిశీధ రాత్రి వేళ – నార్భటించుచు
నయ్యో నరాంతకుల్ చేబూని యీటెలన్
ఒక – ఖూని వానివలెను గట్టి – కొంచుబోయిరా
||మనస||
Aa Nisheedha Raatri Vela – Naarbhatinchuchu
Nayyo Naraantakul Chebooni Yeetelan
Oka – Khooni Vaanivalenu Gatti – Konchuboyiraa
||Manasa||
Verse 3
పట్టి దొంగవలెను గంత – గట్టి కన్నులన్
మరి – గొట్టి చెంపలన్ వడి – దిట్టి నవ్వుచున్
నిను – గొట్టి రెవ్వరదియు మాకు – జెప్పమనిరట
||మనస||
Patti Dongavalenu Ganta – Gatti Kannulan
Mari – Gotti Chempalan Vadi – Ditti Navvuchun
Ninu – Gotti Revvaradiyu Maaku – Jeppamanirata
||Manasa||
Verse 4
ముళ్ల తోడ నొక కిరీట – మల్లి ప్రభు తలన్
బెట్టి – రెల్లు కర్రతో నా – కళ్ళ జనములు
రాజిల్లు మనుచు గొట్టి నవ్వి – గొల్లు బెట్టిరా
||మనస||
Mulla Toda Noka Kireeta – Malli Prabhu Talan
Betti – Rellu Karrato Naa – Kalla Janamulu
Raajillu Manuchu Gotti Navvi – Gollu Bettiraa
||Manasa||
Verse 5
మొయ్యలేక సిల్వ భారము – మూర్చ బోయెనా
అయ్యయ్యో జొక్కెనా యేసయ్య తూలెనా
మా – యయ్యనిన్ దలంపగుండె – లదరి పోయెనా
||మనస||
Moyyaleka Silva Bhaaramu – Moorcha Boyenaa
Ayyayyo Jokkenaa Yesayya Toolenaa
Maa – Yayyanin Dalampagunde – Ladari Poyenaa
||Manasa||
Verse 6
కాలు సేతులన్ గుదించి – కల్వరి గిరిపై
నిన్ – గేలి జేయుచు నీ – కాళ్ళ మీదను
నినుప – చీలలతో గృచ్చి నిన్ను – సిల్వ గొట్టిరా
||మనస||
Kaalu Setulan Gudinchi – Kalvari Giripai
Nin – Geli Jeyuchu Nee – Kaalla Meedanu
Ninupa – Cheelalato Gruchchi Ninnu – Silva Gottiraa
||Manasa||
Verse 7
దేవ సుతుడా వైతి వేని – తీవరంబుగా
దిగి – నీవు వేగమే రమ్ము – గావు మనుచును
ఇట్లు – గావరించి పల్కు పగర – కరుణ జూపెనా
||మనస||
Deva Sutudaa Vaiti Veni – Teevarambugaa
Digi – Neevu Vegame Rammu – Gaavu Manuchunu
Itlu – Gaavarinchi Palku Pagara – Karuna Joopenaa
||Manasa||
Verse 8
తన్ను జంపు శత్రువులకు – దయను జూపెనా
తన – నెనరు జూపెనా ప్రభు – కనికరించెనా
ఓ – జనక యీ జనుల క్షమించు – మనుచు వేడెనా
||మనస||
Tannu Jampu Shatruvulaku – Dayanu Joopenaa
Tana – Nenaru Joopenaa Prabhu – Kanikarinchenaa
O – Janaka Yee Janula Kshaminchu – Manuchu Vedenaa
||Manasa||
Verse 9
తాళలేని బాధ లీచ్చి – దాహమాయెనా
నన్నేలువానికి నా – పాలి స్వామికి
నేనేల పాపములను జేసి – హింస పరచితి
||మనస||
Taalaleni Baadha Leechchi – Daahamaayenaa
Nanneluvaaniki Naa – Paali Svaamiki
Nenela Paapamulanu Jesi – Hinsa Parachiti
||Manasa||
Verse 10
గోడు బుచ్చి సిలువపైన – నేడు మారులు
మాట్లాడి ప్రేమతో నా – నాడు శిరమును
వంచి – నేడు ముగిసె సర్వ మనుచు – వీడె ప్రాణము
||మనస||
Godu Buchchi Siluvapaina – Nedu Maarulu
Maatlaadi Premato Naa – Naadu Shiramunu
Vanchi – Nedu Mugise Sarva Manuchu – Veede Praanamu
||Manasa||
Verse 11
మరణమైన ప్రభుని జూచి – ధరణి వణకెనా
బల్ – గిరులు బగిలెనా – గుడి తెరయు జీలెనా
దివాకరుడు చీకటాయె మృతులు – తిరిగి లేచిరి
||మనస||
Maranamaina Prabhuni Joochi – Dharani Vanakenaa
Bal – Girulu Bagilenaa – Gudi Terayu Jeelenaa
Divaakarudu Cheekataaye Mrutulu – Tirigi Lechiri
||Manasa||
Verse 12
ఇంత జాలి యింత ప్రేమ – యింత శాంతమా
నీ – యంత కరుణను నే – జింత చేయగా
నీ – వింత లెల్ల నిత్య జీవ – విధము లాయెనా
||మనస||
Inta Jaali Yinta Prema – Yinta Shaantamaa
Nee – Yanta Karunanu Ne – Jinta Cheyagaa
Nee – Vinta Lella Nitya Jeeva – Vidhamu Laayenaa
||Manasa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.