Mandinchu Prabhuvaa Nee Aatma Naalo Prakaashincheda Nee Lyrics in Telugu & English
Verse 1
మండించు ప్రభువా నీ ఆత్మ నాలో - ప్రకాశించెద నీ ప్రతిబింబమై
రగిలించు ప్రభువా ఉజ్జీవము - వెలిగించెద అనేకులను (2)
అభిషేకించయా నన్ను మండించయానాపై ప్రోక్షించయా నీ ఆత్మను (2)
అంత్యకాలపు అభిషేకం కుమ్మరించుము మాపైన
మండుచున్న పొదలాగ ఆరకుండ మండించయ్యా (2)
పెంతెకోస్తు దినమున దిగిన ఆత్మవర్షము కురిపించయ్యా
మేడగదిలో పొందిన అనుభవం నేడు మాకు ఇమ్మయ్యా
||అభిషేకించయా||
Mandinchu Prabhuvaa Nee Aatma Naalo - Prakaashincheda Nee Pratibimbamai
Ragilinchu Prabhuvaa Ujjeevamu - Veligincheda Anekulanu (2)
Abhishekinchayaa Nannu Mandinchayaanaapai Prokshinchayaa Nee Aatmanu (2)
Antyakaalapu Abhishekam Kummarinchumu Maapaina
Manduchunna Podalaaga Aarakunda Mandinchayyaa (2)
Pentekostu Dinamuna Digina Aatmavarshamu Kuripinchayyaa
Medagadilo Pondina Anubhavam Nedu Maaku Immayyaa
||Abhishekinchayaa||
Verse 2
అంధకార శక్తులను నీదు ఆత్మతో బంధించయ్యా
దాగివున్న సర్పములన్ కాల్చివేయుము నీ అగ్నిలో (2)
ఎండిపోయిన ఎముకలను జీవింపచేయుము నీ ఆత్మతో
శరీర క్రియలను నసింపజేసే దహించు ఆత్మతో నింపయ
||అభిషేకించయా||
Andhakaara Shaktulanu Needu Aatmato Bandhinchayyaa
Daagivunna Sarpamulan Kaalchiveyumu Nee Agnilo (2)
Endipoyina Emukalanu Jeevimpacheyumu Nee Aatmato
Shareera Kriyalanu Nasimpajese Dahinchu Aatmato Nimpaya
||Abhishekinchayaa||
Verse 3
ఆత్మ కలిగిన పరిచర్య చేయు జ్ఞానము మాకిమ్మయా
మహిమ కలిగిన కార్యములు సంఘమందు జరిగించయా (2)
మాలో ఉన్న కృపావరములు ప్రజ్వలింప చేయుమయా
నిత్యము మండే బలిపీఠముగా అగ్ని మాలో రగిలించయా
||అభిషేకించయా||
Aatma Kaligina Paricharya Cheyu Jnyaanamu Maakimmayaa
Mahima Kaligina Kaaryamulu Sanghamandu Jariginchayaa (2)
Maalo Unna Krupaavaramulu Prajvalimpa Cheyumayaa
Nityamu Mande Balipeethamugaa Agni Maalo Ragilinchayaa
||Abhishekinchayaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.