Skip to content
ThuthiThuthiThuthi

Neeti Nyaayamulu Jariginchu Naa Yesayyaa Song Lyricsనీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

Neeti Nyaayamulu Jariginchu Naa Yesayyaa Lyrics in Telugu & English

Present

Chorus

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2)

వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా

నీ ప్రియమైన స్వాస్థ్యమును

రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను

నీ రాజ్య దండముతో

||నీతి||

Neeti Nyaayamulu Jariginchu Naa Yesayyaa

Nitya Jeevaarthamainavi Nee Shaasanamulu (2)

Vruddhi Chesitivi Parishuddha Janamugaa

Nee Priyamaina Svaasthyamunu

Raddu Chesitivi Prativaadi Tantramulanu

Nee Raajya Dandamuto

||Neeti||

Verse 1

ప్రతి వాగ్ధానము నా కొరకేనని

ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు (2)

నిత్యమైన కృపతో నను బలపరచి

ఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2)

||నీతి||

Prati Vaagdhaanamu Naa Korakenani

Prati Sthalamandu – Naa Todai Kaapaaduchunnaavu Neevu (2)

Nityamaina Krupato Nanu Balaparachi

Ghanatanu Deergaayuvunu Dayacheyuvaadavu (2)

||Neeti||

Verse 2

పరిమళ వాసనగ నేనుండుటకు

పరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు (2)

ప్రగతి పథములో నను నడిపించి

ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు (2)

||నీతి||

Parimala Vaasanaga Nenundutaku

Parishuddha Tailamuto – Nannabhishekinchi Yunnaavu Neevu (2)

Pragati Pathamulo Nanu Nadipinchi

Prakhyaatini Manchi Perunu Kaliginchuvaadavu (2)

||Neeti||

Verse 3

నిత్య సీయోనులో నీతో నిలుచుటకు

నిత్య నిబంధనను – నాతో స్థిరపరచుచున్నావు నీవు (2)

మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు

ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు (2)

||నీతి||

Nitya Seeyonulo Neeto Niluchutaku

Nitya Nibandhananu – Naato Sthiraparachuchunnaavu Neevu (2)

Mahima Kaligina Paatraga Undutaku

Prajnya Vivekamulato Nanu Nimpuvaadavu (2)

||Neeti||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N