Okasaari Aalochinchavaa O Sodaraa Lyrics in Telugu & English
Chorus
ఒకసారి ఆలోచించవా ఓ సోదరా
ఒకసారి అవలోకించవా ఓ సోదరీ (2)
నీ జీవిత మూలమేదో - నీ బ్రతుకు ఆధారమేదో (2)
||ఒకసారి||
Okasaari Aalochinchavaa O Sodaraa
Okasaari Avalokinchavaa O Sodaree (2)
Nee Jeevita Moolamedo - Nee Bratuku Aadhaaramedo (2)
||Okasaari||
Verse 1
తండ్రి యెహోవా తన్ను పోలి - నిను చేసెను తన వూపిరిలో (2)
నా వలెనే నీవు పరిశుద్దముగ - జీవించమని కోరెను .
||ఒకసారి||
Tandri Yehovaa Tannu Poli - Ninu Chesenu Tana Voopirilo (2)
Naa Valene Neevu Parishuddamuga - Jeevinchamani Korenu .
||Okasaari||
Verse 2
దేవుని వదలి దుష్టుని కూడి - లోకము తట్టు మరలి (2)
లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా
||ఒకసారి||
Devuni Vadali Dushtuni Koodi - Lokamu Tattu Marali (2)
Loka Maaya Sankellalo Chikki Duraashalalo Anagaaritivaa
||Okasaari||
Verse 3
లోకము వీడు యేసయ్యన్ చూడు - నిత్య జీవముకై పరుగిడు (2)
నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా
||ఒకసారి||
Lokamu Veedu Yesayyan Choodu - Nitya Jeevamukai Parugidu (2)
Nene Maargamu, Satyamu, Jeevamani Selavichchenu Mana Messayyaa
||Okasaari||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.