Skip to content
ThuthiThuthiThuthi

Prabhuvaa Paraloka Jeevaagni Nimmu Song Lyricsప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము

Prabhuvaa Paraloka Jeevaagni Nimmu Lyrics in Telugu & English

Present

Verse 1

ప్రభువా పరలోక - జీవాగ్ని నిమ్ము

పరిపూర్ణముగా - జీవము నిమ్ము

పావనాత్మాగ్నిని - నాలో జ్వలింపగ

పరిశుద్ధ జీవము - పూర్తిగ నిమ్ము

Prabhuvaa Paraloka - Jeevaagni Nimmu

Paripoornamugaa - Jeevamu Nimmu

Paavanaatmaagnini - Naalo Jvalimpaga

Parishuddha Jeevamu - Poortiga Nimmu

Verse 2

నిను హృదయంబార - ప్రేమించునట్లు

నింపుము నా మది - ప్రేమాగ్నితో

సర్వము హృదయము - కాయము నిచ్చెద

స్వర్గీయ జీవ సమృద్ధి నిమ్ము

Ninu Hrudayambaara - Preminchunatlu

Nimpumu Naa Madi - Premaagnito

Sarvamu Hrudayamu - Kaayamu Nichcheda

Svargeeya Jeeva Samruddhi Nimmu

Verse 3

యేసు స్తుతి నే పాడునట్లు

ఆశనొసగుము - నా హృదయములో

నన్నుండి జీవము - ప్రవహించునట్లు

నీలో సంతృప్తిగ త్రాగెదను

Yesu Stuti Ne Paadunatlu

Aashanosagumu - Naa Hrudayamulo

Nannundi Jeevamu - Pravahinchunatlu

Neelo Santruptiga Traagedanu

Verse 4

ప్రశస్తరక్తమున - కడుగుము

పాప మృత్యువు నుండి విడిపించుము

సింహాసనం నాలో స్థాపించి

వాగ్దానము నెరవేర్చుము నాలో

Prashastaraktamuna - Kadugumu

Paapa Mrutyuvu Nundi Vidipinchumu

Sinhaasanam Naalo Sthaapinchi

Vaagdaanamu Neraverchumu Naalo

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P