Skip to content
ThuthiThuthiThuthi

Sarvayugaaniki Kaarana Janmudu Sarva Srushtiki Kaarana Song Lyricsసర్వయుగానికి కారణ జన్ముడు సర్వ సృష్టికి కారణ

Sarvayugaaniki Kaarana Janmudu Sarva Srushtiki Kaarana Lyrics in Telugu & English

Present

Chorus

సర్వయుగానికి కారణ జన్ముడు – సర్వ సృష్టికి కారణ భూతుడు (2)

సశరీరుడై ప్రత్యక్షమయ్యెను – సర్వాధిపతియైన దైవ తనయుడు (2)

ఇమ్మానుయేలుగా మనకై పుట్టెను – దేవుడే మనకు తోడని బయలుపరచెను (2)

సర్వ జనులకు సంబరము – సమాధానమే జగతికి సదాకాలము (2)

Sarvayugaaniki Kaarana Janmudu – Sarva Srushtiki Kaarana Bhootudu (2)

Sashareerudai Pratyakshamayyenu – Sarvaadhipatiyaina Daiva Tanayudu (2)

Immaanuyelugaa Manakai Puttenu – Devude Manaku Todani Bayaluparachenu (2)

Sarva Janulaku Sambaramu – Samaadhaaname Jagatiki Sadaakaalamu (2)

Verse 1

కాలమునే కలిగించినవాడు – కాలములో ప్రవేశించినాడు

నిత్యము మహిమలో నివసించువాడు – దీన శరీరము ధరియించినాడు (2)

కలుషము బాపను కరుణను చూపను – కరుణామయుడుగా దిగివచ్చినాడు (2)

సర్వ జనులకు సంబరము – సమాధానమే జగతికి సదాకాలము (2)

||సర్వయుగానికి కారణ||

Kaalamune Kaliginchinavaadu – Kaalamulo Praveshinchinaadu

Nityamu Mahimalo Nivasinchuvaadu – Deena Shareeramu Dhariyinchinaadu (2)

Kalushamu Baapanu Karunanu Choopanu – Karunaamayudugaa Digivachchinaadu (2)

Sarva Janulaku Sambaramu – Samaadhaaname Jagatiki Sadaakaalamu (2)

||Sarvayugaaniki Kaarana||

Verse 2

అన్నిటినీ కలిగించినవాడు – కడవరి కాలాన ఏతెంచినాడు

ఆది దేవుని స్వరూపియైనవాడు – మానవ రూపము దాల్చినాడు (2)

పాపము మాపను ప్రేమను చూపను – నిజరక్షకుడిగా ఇల వచ్చినాడు (2)

సర్వ జనులకు సంబరము – సమాధానమే జగతికి సదాకాలము (2)

||సర్వయుగానికి కారణ||

Annitinee Kaliginchinavaadu – Kadavari Kaalaana Etenchinaadu

Aadi Devuni Svaroopiyainavaadu – Maanava Roopamu Daalchinaadu (2)

Paapamu Maapanu Premanu Choopanu – Nijarakshakudigaa Ila Vachchinaadu (2)

Sarva Janulaku Sambaramu – Samaadhaaname Jagatiki Sadaakaalamu (2)

||Sarvayugaaniki Kaarana||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S