Skip to content
ThuthiThuthiThuthi

Shaashvatamainadi Nee Prema Naa Yedala Vidadeeyalenidi Song Lyricsశాశ్వతమైనది నీ ప్రేమ నా యెడల విడదీయలేనిది

Also searched as: saswathamainadi

Shaashvatamainadi Nee Prema Naa Yedala Vidadeeyalenidi Lyrics in Telugu & English

Present

Chorus

శాశ్వతమైనది నీ ప్రేమ నా యెడల - విడదీయలేనిది నీ స్నేహబంధము

నీ ప్రేమ పందిరిలో ఫలియింపజేసితివే

నీ దివ్య సన్నిధిలో ఎనలేని సంతోషమే నీవే తోడుండగా -

ప్రతి విజయం నా సొంతమే నీవే దీవించగా -

మార్చతరమా ఏదైననూ (మార్చగలరా ఎవరైననూ)

వర్ణకందని నీ ప్రేమ ఓదార్చెనయ్యా వేదనలో లోకప్రేమలు

నీదు ప్రేమకు సాటిరావుగా స్వార్ధమయ్యా ఈ లోకమే -

దాటివెళ్ళకు నన్నెన్నడూ చాలునయ్యా

నీ కృప నాకు నన్ను నడుపుము

నీ దయతో నీవే నాకుండగా - ప్రతి క్షణము పరవశమే

నీవే దర్శించగా - ధన్యమయ్యా నా జీవితం

||శాశ్వతమైనది||

Shaashvatamainadi Nee Prema Naa Yedala - Vidadeeyalenidi Nee Snehabandhamu

Nee Prema Pandirilo Phaliyimpajesitive

Nee Divya Sannidhilo Enaleni Santoshame Neeve Todundagaa -

Prati Vijayam Naa Sontame Neeve Deevinchagaa -

Maarchataramaa Edainanoo (Maarchagalaraa Evarainanoo)

Varnakandani Nee Prema Odaarchenayyaa Vedanalo Lokapremalu

Needu Premaku Saatiraavugaa Svaardhamayyaa Ee Lokame -

Daativellaku Nannennadoo Chaalunayyaa

Nee Krupa Naaku Nannu Nadupumu

Nee Dayato Neeve Naakundagaa - Prati Kshanamu Paravashame

Neeve Darshinchagaa - Dhanyamayyaa Naa Jeevitam

||Shaashvatamainadi||

Verse 1

కలవరమొందిన వేళలలో నీ ఉన్నతమైన వాక్యముతో

తలను వంచని తెగువ నాలో కలుగజేసినావు

మేలు కొరకే శోధనలన్నీ - అనుమతించిన నా తండ్రివే

ఘనత కొరకే గాయములన్నీ -

అనుభవింపగా తలచితివే నీవే నడిపించగా -

ప్రతి దినము ఆనందమే నీవే కరుణించగా-

కలతలైనా కమనీయమే

||శాశ్వతమైనది||

Kalavaramondina Velalalo Nee Unnatamaina Vaakyamuto

Talanu Vanchani Teguva Naalo Kalugajesinaavu

Melu Korake Shodhanalannee - Anumatinchina Naa Tandrive

Ghanata Korake Gaayamulannee -

Anubhavimpagaa Talachitive Neeve Nadipinchagaa -

Prati Dinamu Aanandame Neeve Karuninchagaa-

Kalatalainaa Kamaneeyame

||Shaashvatamainadi||

Verse 2

ప్రాకారముగా కాచితివే ప్రతి చోట సాక్షిగా నిలిపితివే

ఎన్నడెరుగని విజయ బాటలో నన్ను నడిపితివే

నీ సువార్తనే నా ప్రాణముగా -

ఎంచుకొనుటే నా భాగ్యము నీదు సేవలో అంతము వరకు -

తేజరిల్లుటే నా ధ్యేయము నిన్నే సేవింతును -

నీ కృపలో హర్షింతును నిన్నే ఘనపరతును -

నీ మహిమకై జీవింతును

||శాశ్వతమైనది||

Praakaaramugaa Kaachitive Prati Chota Saakshigaa Nilipitive

Ennaderugani Vijaya Baatalo Nannu Nadipitive

Nee Suvaartane Naa Praanamugaa -

Enchukonute Naa Bhaagyamu Needu Sevalo Antamu Varaku -

Tejarillute Naa Dhyeyamu Ninne Sevintunu -

Nee Krupalo Harshintunu Ninne Ghanaparatunu -

Nee Mahimakai Jeevintunu

||Shaashvatamainadi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S