Skip to content
ThuthiThuthiThuthi

Stotraarpana Narpintamu Japa Dhoopamu Vesi Keertintamu Song Lyricsస్తోత్రార్పణ నర్పింతము జప ధూపము వేసి కీర్తింతము

Stotraarpana Narpintamu Japa Dhoopamu Vesi Keertintamu Lyrics in Telugu & English

Present

Chorus

స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము వేసి కీర్తింతము పాత్రుం డైన

శ్రీ యేసుఁడు పరమ భోజనాంశమైనందున

||స్తోత్రార్పణ||

Stotraarpana Narpintamu Japa Dhoopamu Vesi Keertintamu Paatrum Daina

Shree Yesundu Parama Bhojanaanshamainanduna

||Stotraarpana||

Verse 1

కృతజ్ఞతా స్తోత్రంబులన్ దేవ కృపార్థంబై చేయుదము క్షీతి నాతండు

బలి నియ్యఁగాఁ పుట్టె నూతనంపు నిబంధన

||స్తోత్రార్పణ||

Krutajnyataa Stotrambulan Deva Krupaarthambai Cheyudamu Ksheeti Naatandu

Bali Niyyangaan Putte Nootanampu Nibandhana

||Stotraarpana||

Verse 2

పాపము లన్ని హరించెను మా ప్రభు వగు యేసు సురక్తము ఏపుగ

దీనిఁ దలంచుచు నిఁక నెన్నఁడు యేసుని భజింతము

||స్తోత్రార్పణ||

Paapamu Lanni Harinchenu Maa Prabhu Vagu Yesu Suraktamu Epuga

Deenin Dalanchuchu Ninka Nennandu Yesuni Bhajintamu

||Stotraarpana||

Verse 3

చావు నుండి రక్షించెను స జీవులలో లెక్కించెను దేవుని కిఁక

నర్పింతము స జీవార్పణ బలిగను

||స్తోత్రార్పణ||

Chaavu Nundi Rakshinchenu Sa Jeevulalo Lekkinchenu Devuni Kinka

Narpintamu Sa Jeevaarpana Baliganu

||Stotraarpana||

Verse 4

పుణ్యరక్త శరీరముల లోఁ పాలొందు మన మందరము అన్యులము

కానేరము దై వాన్యోన్యంబు నొందినాము

||స్తోత్రార్పణ||

Punyarakta Shareeramula Lon Paalondu Mana Mandaramu Anyulamu

Kaaneramu Dai Vaanyonyambu Nondinaamu

||Stotraarpana||

Verse 5

మరణ శ్రమల స్మరింతము ప్రభు తిరిగి వచ్చు పర్యంతము ధర నా

యేసు మరణంబును యింకఁ చిరకాలంబుఁ జాటింతము

||స్తోత్రార్పణ||

Marana Shramala Smarintamu Prabhu Tirigi Vachchu Paryantamu Dhara Naa

Yesu Maranambunu Yinkan Chirakaalambun Jaatintamu

||Stotraarpana||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S