Skip to content
ThuthiThuthiThuthi

Vijaya Geetamul Paadare Kreestuku Jaya Vijaya Geetamul Song Lyricsవిజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్

Also searched as: vijaya geethamu

Vijaya Geetamul Paadare Kreestuku Jaya Vijaya Geetamul Lyrics in Telugu & English

Present

Chorus

విజయ గీతముల్ పాడరే

క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే (2)

వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవ

నిజ కుమారుని నామమున్

హృదయములతో – భజన జేయుచు నిత్యమున్

||విజయ||

Vijaya Geetamul Paadare

Kreestuku Jaya – Vijaya Geetamul Paadare (2)

Vrujina Mantati Meeda – Vijaya Michchedu Deva

Nija Kumaaruni Naamamun

Hrudayamulato – Bhajana Jeyuchu Nityamun

||Vijaya||

Verse 1

మంగళముగ యేసుడే

మనకు రక్షణ – శృంగమై మరి నిలచెను

నింగిన్ విడిచి వచ్చెను

శత్రుని యుద్ధ – రంగమందున గెల్చెను

రంగు మీరగదన – రక్త బలము వలన

పొంగు నణగ జేసెను

సాతానుని బల్ – కృంగ నలిపి చీల్చెను

||విజయ||

Mangalamuga Yesude

Manaku Rakshana – Shrungamai Mari Nilachenu

Ningin Vidichi Vachchenu

Shatruni Yuddha – Rangamanduna Gelchenu

Rangu Meeragadana – Rakta Balamu Valana

Pongu Nanaga Jesenu

Saataanuni Bal – Krunga Nalipi Cheelchenu

||Vijaya||

Verse 2

పాపముల్ దొలగింపను

మనలను దన స్వ – రూపంబునకు మార్పను

శాపం బంతయు నోర్చెను

దేవుని న్యాయ – కోపమున్ భరియించెను

పాపమెరుగని యేసు – పాపమై మనకొరకు

పాప యాగము దీర్చెను

దేవుని నీతిన్ – ధీరుడై నెరవేర్చెను

||విజయ||

Paapamul Dolagimpanu

Manalanu Dana Sva – Roopambunaku Maarpanu

Shaapam Bantayu Norchenu

Devuni Nyaaya – Kopamun Bhariyinchenu

Paapamerugani Yesu – Paapamai Manakoraku

Paapa Yaagamu Deerchenu

Devuni Neetin – Dheerudai Neraverchenu

||Vijaya||

Verse 3

సిలువ మరణము నొందియు

మనలను దనకై – గెలువన్ లేచిన వానికి

చెలువుగన్ విమలాత్ముని

ప్రేమను మనలో – నిలువన్ జేసిన వానికి

కొలువు జేతుమెగాని – ఇలను మరువక వాని

సిలువ మోయుచు నీ కృపా

రక్షణ చాల విలువ గలదని చాటుచు

||విజయ||

Siluva Maranamu Nondiyu

Manalanu Danakai – Geluvan Lechina Vaaniki

Cheluvugan Vimalaatmuni

Premanu Manalo – Niluvan Jesina Vaaniki

Koluvu Jetumegaani – Ilanu Maruvaka Vaani

Siluva Moyuchu Nee Krupaa

Rakshana Chaala Viluva Galadani Chaatuchu

||Vijaya||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with V