Yesu Naamaamrutamu Kannanu Vere Maakinka Ledugaa Lyrics in Telugu & English
Chorus
యేసు నామామృతము కన్నను వేరే మాకిఁక లేదుగా దోసముల
నెడబాపి పరమని వాస పదవికిఁ జేర్చుఁగా
||యేసు||
Yesu Naamaamrutamu Kannanu Vere Maakinka Ledugaa Dosamula
Nedabaapi Paramani Vaasa Padavikin Jerchungaa
||Yesu||
Verse 1
నిత్య రక్షణ నిత్య జీవము నిజముగా మాకిచ్చును సత్యసువిశేషార్థసారము
సతము గ్రోలుట కొసఁగెను
||యేసు||
Nitya Rakshana Nitya Jeevamu Nijamugaa Maakichchunu Satyasuvisheshaarthasaaramu
Satamu Groluta Kosangenu
||Yesu||
Verse 2
దురిత భవ మను నంధకారము దూరముగఁ బోఁదోలెఁగా అరయఁ
దన విమలాత్మ వరమున మరల మము వెలిఁగించెఁగా
||యేసు||
Durita Bhava Manu Nandhakaaramu Dooramugan Bondolengaa Arayan
Dana Vimalaatma Varamuna Marala Mamu Velinginchengaa
||Yesu||
Verse 3
గొప్ప కుల గర్వముల మెప్పను తప్పుల న్విడఁగొట్టెను చెప్ప శక్యముగాని
రక్షణ సృష్టిలో మము నిల్పెను
||యేసు||
Goppa Kula Garvamula Meppanu Tappula Nvidangottenu Cheppa Shakyamugaani
Rakshana Srushtilo Mamu Nilpenu
||Yesu||
Verse 4
అడ్డు పరచు పిశాచి మార్గపు జిడ్డులను ఛేదించెను దొడ్డ కాపరి యేసు
తన దగు దొడ్డిలో మముఁ జేర్చెను.
||యేసు||
Addu Parachu Pishaachi Maargapu Jiddulanu Chhedinchenu Dodda Kaapari Yesu
Tana Dagu Doddilo Mamun Jerchenu.
||Yesu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.